Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ లో కానుకల కలకలం

0 11

కాంగ్రెస్ లో కానుకల కలకలం
– ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపణలపై దుమారం
– బెంజ్ కారులో తిరిగిన మంత్రులు
– అధిష్ఠానం ఆరా
కాంగ్రెస్ లో కానుకల అంశం కలకలం రేపుతోంది. బీజేపీ నాయకుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన ఆరోపణ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏఐసీసీ పరిశీలకురాలు దీపాదాస్ మున్షికి పదవి కోసం ఒకరు బెంజ్ కారు కానుకగా ఇచ్చారని ప్రభ్రాకర్ ఆరోపించారు. ఈ ఆరోపణపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఆరోపణలు రుజువు చేయాలని, లేకుంటే కోర్టులో కేసు వేస్తామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. అయినప్పటికీ ప్రభాకర్ వెనుకడుగు వేయడం లేదు. కాంగ్రెస్ లో కానుకల సంస్కృతి కొత్తది కాదు. ఆరోపణలు కూడా మామూలే. గతంలో రేవంత్ రెడ్డి మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలాంటి ఆరోపణ చేసిన విషయం విదితమే. దిల్లీలో డబ్బులు ఇచ్చి పదవులు తెచ్చుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌషిక్ రెడ్డి, డి. సుధీర్ రెడ్డి లు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు చేసినందుకు వీరిపై పరువు నష్టం కేసు వేశారు. సాధారణంగా ఇలాంటి కానుకలకు ఆధారాలు ఉండవు. ఎలా పదవులు వస్తాయనే విషయం అందరికి తెలుసు.
బెంజ్ కారులో తిరిగిన మంత్రులు
రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీ రాజ్ శాఖా మంత్రి సీతక్క ఇటీవల కారులో పర్యటించడం చర్చనీయాంశమైంది. బాల్కొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ముత్యాల సునీల్ రెడ్డి బెంజ్ కారులో తిరిగారు. ఈ కారు విలువ సుమారు రెండు కోట్ల వరకు ఉంటుంది. సునీల్ రెడ్డికి ఆరెంజ్ ట్రావెల్స్ ఉంది. ట్రావెల్స్ ఉన్నందున బెంజ్ కారు కానుకగా ఇచ్చారని సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అధిష్ఠానం ఆరా
బీజేపీ నాయకులు ప్రభాకర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం నిజానిజాలను ఆరా తీస్తోంది. పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చినందున తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పరిశీలకులు ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కాంగ్రెస్ నాయకులు అవినీతికి పాల్పాడితే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని భావిస్తున్నారు. గతంలో ఇలాంటి ఆరోపణలు వస్తే ఇంచార్జీలను మార్చారు. ఏ నాయకుల మీద ఆరోపణలు వచ్చినా అధిష్ఠానం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking