Take a fresh look at your lifestyle.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం సంతకాల సేకరణ

0 13

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలి

ప్రభుత్వం స్పందించకుంటే యూనియన్లకు అతీతంగా నిరసన

టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జగిత్యాలలో సంతకాల సేకరణ

జగిత్యాల, ఏప్రిల్ 23 : అర్హులైన జర్నలిస్టులకు జగిత్యాల జిల్లా కేంద్రంలో నివేశన స్థలాలను వెంటనే మంజూరు చేసి గృహ నిర్మాణాలకు ఆర్థిక సహాయం అందించాలని సీనియర్ జర్నలిస్టులు ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధ్యావర సంజీవరాజు, జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు ఎన్ జైపాల్, వెంకటరమణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు సిరిసిల్ల శ్రీనివాస్, జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏం. ప్రదీప్ కుమార్, ఐ జె యు జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లాల రాజేందర్ రెడ్డి లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల నుండి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని పదేపదే వాగ్దానం చేస్తూ దాటవేత ధోరణి ఆలంబిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాల కేటాయింపుతో పాటు గృహ నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టులకు ఇళ్లకి స్థలాల కేటాయింపుపై ఏటువంటి స్పందన లేకపోతే రాబోవు రోజుల్లో జర్నలిస్టులందరం యూనియన్లకు అతీతంగా నిరసన కార్యక్రమాలను చేపడతామని నిరాహార దీక్షలకు పిలుపునిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, మాకు రాజలింగం, కోశాధికారి మేన్నెని శ్రీనివాసరావు,కళాశ్రీ గుండేటి రాజు, బెజ్జంకి సంపూర్ణ చారి, లక్ష్మారెడ్డి,ఆనంతుల కాంతారావు లక్ష్మణ్, సిరిసిల్ల వేణుగోపాల్,కొత్తూరి మహేష్ కుమార్, రాజకుమార్, మహేష్ పటేల్, రేణికుంట శ్రీనువాసు,ఆముద లింగారెడ్డి, కడలి మోహన్ రావు, రాజేశ్వర్ రెడ్డి, ఎం. ముఖేష్ రెడ్డి, అక్కినపల్లి బాబు, కాసం శ్రీనివాస్ రెడ్డి, గణేష్ లవంగా, సిరిపురం శ్రీనివాస్, గోనె గంగాధర్, గౌరీశంకర్, రాజేశ్వర్ రెడ్డి లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking