Take a fresh look at your lifestyle.

కొడంగల్ లో సీఎం రేవంత్ పర్యటన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన

0 13

కొడంగల్ లో సీఎం రేవంత్ పర్యటన
పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన
కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో స్విచ్ ఆన్ చేసి ఒకేసారి పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం శంఖుస్థాపన చేసారు. రూ.4,369.143 కోట్ల అభివృద్ధి పనులకు అయన శంకుస్థాపన చేసారు.
రూ.2,945 కోట్లతో నారాయణపేట్ – కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, రూ.6.8 కోట్ల అంచనా వ్యయంతో కొడంగల్ లో ఆర్ అండ్ బి అతిధి గృహ నిర్మాణం, రూ.344.5 కోట్ల అంచనా వ్యయంతో కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా సింగిల్ లేన్ నుండి డబుల్ లేన్ రోడ్లు,వాటి విస్తరణ, పలు బ్రిడ్జిల నిర్మాణాలకు శంకుస్థాపన, రూ.27.886 కోట్లతో వికారాబాద్ జిల్లాలో బిటి రోడ్డు సదుపాయం లేని మారుమూల గిరిజన ప్రాంతాలకు రోడ్లకు శంకుస్థాపన చేశారు.
, రూ.5 కోట్లతో గిరిజన సంక్షేమ హాస్టల్ భవనానికి భూమి పూజ, రూ.25 కోట్లతో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ శాశ్వత భవనం, రూ.40 కోట్లతో సి.సి రోడ్ల నిర్మాణం, రూ.7.13 కోట్లతో దౌల్తాబాద్ జూనియర్ కాలేజి, రూ.7.13 కోట్లతో బొమ్రాస్పేట్ జూనియర్ కాలేజి, రూ.25 కోట్లతో నీటుర్ గ్రామం, దౌల్తాబాద్ మండలం మహాత్మా జ్యోతిరావు పూలే బిసీ రెసిడెన్షియల్ స్కూల్/కాలేజి, రూ.360 కోట్లతో చంద్రకల్ గ్రామం,దౌల్తాబాద్ మండలంలో నూతన వెటర్నరీ కాలేజి నిర్మాణం చేయనున్నారు.
రూ.30 కోట్లతో కోస్గి మండల కేంద్రంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, రూ.11 కోట్లతో కోస్గి మండల కేంద్రంలో మహిళా డిగ్రీ కళాశాల, రూ.20 కోట్లతో మద్దూర్ మండల కేంద్రంలో బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్/జూనియర్ కాలేజి, రూ.25 కోట్లతో కొడంగల్ మండల కేంద్రంలో బాలుర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్/జూనియర్ కాలేజి, రూ.224.50 కోట్లతో మెడికల్ కాలేజీ,నర్సింగ్ కాలేజి, ఫిజియోథెరపీ కాలేజి,220 పడకల హాస్పిటల్, రూ.213.2070 కోట్లతో కొడంగల్ నియోజకవర్గంలో హెచ్ఎల్బిఎస్, R/Fs అప్రోచ్ రోడ్ పనులు, రూ.3.99 కోట్లతో దుద్యాల్ మండలంలోనీ హస్నాబాద్ గ్రామ నూతన 33/11 కెవి సబ్ స్టేషనలకు అయన శంకుస్థాపనచేసారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking