Take a fresh look at your lifestyle.

ముందస్తుపై సీఎం జగన్ క్లారిటీ…

0 13

ముందస్తుపై సీఎం జగన్ క్లారిటీ…

   9 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి
      టీడీపీ మ్యానిఫెస్టోపై ఆసక్తికర వ్యాఖ్య

అమరావతి జూన్ 7 :  ఏపీలో ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. ఈరోజు జరిగిన మంత్రుల సమావేశంలో సీఎం జగన్ ఊహాగానాలకు తెరదించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని జగన్ తేల్చిచెప్పేశారు. ఈమేరకు కేబినెట్‌ సమావేశంలో మంత్రులకు స్పష్టంగా తెలియజేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు.

ఇంకో 9 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని మంత్రులకు జగన్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ 9 నెలలు బాగా కష్టపడాలని మంత్రులకు ఈ సందర్భంగా సీఎం సూచించారు. ఇప్పుడు కష్టపడితే మళ్లీ గెలుపు మనదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. పనిలో పనిగా ఇటీవల రాజమండ్రి మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో అంశాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్ గుర్తుచేశారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోను పట్టించుకోవాల్సిన అవసరం లేదని జగన్ తేల్చిచెప్పారు.

ఇటీవల ముందస్తు ఎన్నికలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా మాట్లాడారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదని చెప్పారు. దీనిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఎద్దేవా చేసింది. ముందస్తుకు వెళ్తే ఓడిపోతామన్న భయంతో వైసీపీ వణికిపోతుందని ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శించారు. వైనాట్ 175 సీట్లు గెలుస్తామన్న జగన్ డాంబికాలు ఏమయ్యాయని వర్ల రామయ్య నిలదీశారు. తాజాగా సీఎం జగన్‌ కూడా ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చేశారు. మరీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

కేబినెట్ నిర్ణయాలు…

ఈ ఏడాది అమ్మఒడి పథకం అమలుకు కేబినెట్‌ ఆమోదం, జగనన్న అమ్మ ఒడి పథకాన్ని జూన్ 28న అమలు, ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి కేబినెట్‌ ఆమోదం, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్‌ ఆమోదం,  2024 జూన్‌ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగులకు వర్తింపు,  గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో ఎంవోయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం,         రాష్ట్రంలోని కొత్త మెడికల్ కళాశాలల కు 706 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం, చిత్తూరు డైరీ ప్లాంట్ కు చెందిన 28 ఎకరాల భూమినీ లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు కేబినెట్ అంగీకారం,

ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా 5 వేల కోట్ల రూపాయల రుణ సేకరణకు అనుమతి ఇచ్చిన కేబినెట్, జూన్ 12 నుంచి 17 వరకూ జగనన్న విద్యా కానుక వారోత్సవాలు నిర్వాహణకు కేబినెట్ ఆమోదం,  పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు అవార్డులు ప్రదానం చేసేందుకు కేబినెట్ ఆమోదం.

ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపకల్పనకు కేబినెట్ ఆమోదం, ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు నిర్ణయం, 12వ పీఆర్సీ ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం, సీపీఎస్ ఉద్యోగుల కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లు,  18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్ల బిగింపునకు రూ. 6,888 కోట్ల వ్యయం,  గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం రూ.445 కోట్ల రుణాల కోసం ఏపీఎఫ్ఎస్ఎల్‌కు కెబినెట్ అనుమతి ఇచ్చింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking