Take a fresh look at your lifestyle.

కేసీఆర్ వి గవ్వే సొల్లు కబుర్లు

0 5

కేసీఆర్ వి గవ్వే సొల్లు కబుర్లు

–      పదవి పోయి సోయి లేని మాటలు..

–      షరతులకు లోబడి కేసీఆర్ ఇంటార్వ్యూ ..

–      నేనే మేధావినని విర్రవీగుతాడు..

–      నిజం తెలుచుకుని జనం సీఎం సీట్లో నుంచి గుంజిండ్రు.

–      బిడ్డ కవిత కడిగిన ముత్యంలా వస్తుందట..

–      బ్రాడ్ థింకింగ్ ను మరిచిన కేసీఆర్..

(యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్)

కేసీఆర్ వి గవ్వే సొల్లు కబుర్లు.. పదవి పోయి సోయి లేని మాటలు.. ఏదో చెబుతాడానుకంటే గవ్వే ఒడిచిన ముచ్చట్లు.. స్క్రీన్ ప్లే.. డైరెక్షన్ షరతులకు లోబడి ఇంటార్వ్యూ.. ఇంతకు వాళ్లు ఇంటార్య్వూవూకు కేసీఆర్ ను పిలిచారా..? లేక ఆయనే ఇంటార్వ్యూ ఏర్పటు చేసుకున్నారా అనుకుంటుండ్రు పబ్లిక్.

అయినా.. కేసీఆర్ మెంటాల్టీ డిఫరెంట్.. ప్రశ్నిస్తే తట్టుకోలేడు.. నిలదీస్తే కండ్లు ఎర్ర జెస్తాడు.. జర్నలిస్టులైనా సరే కేసీఆర్ ను ప్రశ్నిస్తే సహించలేడు. నేనో మేధావినని ఫీలవుతాడు. మోది కంటే కూడా పెద్దోణ్ణి అనుకుంటాడు. నన్ను ముంచినోడు ఈ దునియాలోనే లేడానుకుంటాడు. ఉద్యమ కాలం నుంచి నేనే పార్టీ నేనే తెలంగాణ అనే స్థాయికి కేసీఆర్ వెర్రి పెరిగి పోయింది.

 ఔను.. అదో లైవ్ షో.. రెండు రోజుల ముందు నుంచే కేసీఆర్ లైవ్ అంటూ ప్రచారం.. ఏమి చెప్తాడోననే ఇంట్రెస్ట్.. కానీ.. స్క్రీన్ ప్లే పక్కాగా రాసుకుని ఇంటార్వ్యూ చేసినట్లుగా ఉంది. గంటల తరబడి చేసిన ఇంటార్వ్యూలో కేసీఆర్ వి పస లేని గవ్వే మాటలు. పాడిందే పాటరా పాసుపండ్ల దాసరి అన్నట్లుగా గవ్వే  ముచ్చట్లు.  

ఒకప్పుడు కేసీఆర్ స్పీచ్ అంటే అందరూ న్యూస్ ఛానల్స్ కు అతుక్క పోయేటోళ్లు..  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అతను ఏది మాట్లాడినా పెయి మీద ఎంట్రుకలు నిక్కచ్చిగా నిలుస్తుండే. కానీ.. ఇప్పుడు కేసీఆర్ ఏమి మాట్లాడినా విన సొంపుగా లేవు. పదేళ్లు గిట్ల మాట్లాడే మభ్య పెట్టిండు అనుకుంటుండ్రు. గందుకే పబ్లిక్ కూడా ఎన్నికల్లో సీఎం సీట్లో నుంచి కేసీఆర్ ను గుంజి పారేసిండ్రు.

        ఢిల్లీ లిక్కర్ స్కాం అంతా బోగస్ అట.. కడిగిన ముత్యంలా నా ముద్దుల బిడ్డ కవిత తిరిగి వస్తుందని భరోసాగా చెప్పిండు కేసీఆర్. మోదీ నా మీద క్షక్ష్యతో నా బిడ్డను మద్యం కేసులో ఇరికిచ్చిండని చెప్పిన అతను లాజిక్ మిస్ అయ్యాడు. మోదీ అనుకుంటే కేటీఆర్ ను ఆ మద్యం కేసులో ఇరికిత్తుండే గదా అనే చర్చ నడుస్తోంది.

        కేసీఆర్ తోని ఉన్నోళ్లంతా మంచోళ్లట.. మరో పార్టీలల్లకు పోయేటొళ్లెమో ద్రోహులట. కడియం శ్రీహరి పేరు చెబుతూ పార్టీని వీడి నొళ్లంతా రాజకీయ సమాధి అవుతారని శాపం పెట్టిండు కేసీఆర్. ఇదెక్కడి తీరు అంటే ఏమి సమాధానం చెబుతాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అప్పుడు కూడా ప్రత్యార్థులను తెలంగాణ ద్రోహులుగా ముద్ర వేసి బూతు మాటలు తిట్టిండు. కోపంతో ఉన్న జనం కూడా కేసీఆర్ బూతు మాటలను ఎంజాయ్ చేసిండ్రు.

        కేసీఆర్ లో బ్రాడ్ థింకింగ్ లేదు. సంకోచిత థింకింగ్ తో ఇంకా పొలిటికల్ గా లాభ పడాలనుకుంటుండ్రు. ఇప్పుడది అయ్యేది కాదెమో..?  

పదేళ్ల కాలంలో మీ గవర్నమెంట్ లో మినిష్టర్ లు ఏమి చేసిండ్రో పబ్లిక్ చూసిండ్రు. తెలంగాణ ఉద్యమ ద్రోహులను పిలిచి మినిష్టర్ పదవిలు ఇచ్చినా మిమ్మల్ని చూసిండ్రు. కానీ.. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు నెల రోజులు కాకుండానే కాంగ్రెస్ చేతు పట్టుకుని మీకు భై చెబుతూ వెళుతుండ్రు.  

అయినా.. కేసీఆర్.. మీరు ఏది మాట్లాడినా జనం నమ్మెటట్లు లేరు. తెలంగాణ యాసలో డైలాగ్ లు కొడితే గీ జనం నెత్తికి ఎక్కించుకుంటలేరు. గీ ఎంపీ ఎన్నికలలో మీవొళ్లు గెలుచుడు కష్టమని సర్వేలు చెబుతున్నాయి. బస్సు యాత్ర చేసైనా రెండు, మూడు ఎంపీ సీట్లు గెలిపించుకోక పోతే నీ గులాబీ జెండా మొఖం చూసేటోళ్లు ఉండారని నమ్ము..

యాటకర్ల మల్లేష్

యాటకర్ల మల్లేష్

Leave A Reply

Your email address will not be published.

Breaking