Take a fresh look at your lifestyle.

ఖమ్మంలో తుమ్మల రీ -ఎంట్రీతో మారిన పొలిటికల్ సీన్

0 675

దోస్త్ మేరా దోస్త్ తూహై మేరి జాన్

తుమ్మల రీ -ఎంట్రీతో మారిన సీన్ 

తుమ్మల బిఆర్ఎస్ కు కొండంత అండ

ఎంఎల్ సి మంత్రి పదవి ఆఫర్ ..?

కేసిఆర్ కు నమ్మిన బంటుగా తుమ్మల

పెత్తనాలు , వెన్నుపోట్లు, నమ్మక ద్రోహాలు ఎరుగని తుమ్మల

కట్టప్ప లను పసిగట్టి దూరం పెట్టిన తుమ్మల

కేసిఆర్ ని ఎంతగానో ప్రేమించి, అభిమానించే వ్యక్తిగా పేరున్న తుమ్మల

ఖమ్మం జిల్లాలో సుస్థిర స్థానం సంపాదించుకున్న వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంతో క్రియాశీల రాజకీయాల్లోకి ఆరంగ్రేటం చేసిన తుమ్మల కమ్యునిష్టు , కాంగ్రెస్ ల కంచుకోటగా పేరున్న ఖమ్మం జిల్లాలో తన పేరుని ప్రత్యేకంగా స్వయంకృషితో లిఖించుకున్నారు.

తుమ్మల నాగేశ్వరరావు తన రాజకీయ జీవితంలో అవినీతికి తావివ్వకుండా అనేక మంది నాయకులకు మార్గదర్శిగా మారారు. మాటకు ముందు అభివృద్ధి మాటకు తర్వాత అభివృధ్ది జపం చేసే యోగి గా తుమ్మల పనిచేసారు. 40 యేళ్ల రాజకీయ జీవితంలో ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద క్యాబినెట్ హోదా ను అనుభవించారు.

ప్రతి పక్షంలో ఉన్న కాని పార్టీ అధికారంలోకి వచ్చే వరకు వేచి చూసారే తప్పా అవకాశాల కోసం, అవసరాల కోసం , కాంట్రాక్టుల కోసం , బిల్లుల కోసం పార్టీ కండువాలు మార్చలేదు. అభివృధ్ది అనే సిధ్దాంతం తప్పా మరెలాంటి దుర్బుధ్ది లేని అభివృధ్గి దురంధరుడు తుమ్మల.

జిల్లాలో , పాలేరులో నిర్విరామంగా అభివృద్ధి చేసినప్పటికి కొంత మంది సొంత పార్టీలో వెన్నంటి ఉంటూ చేసిన రాజకీయ కుట్రలో భాగంగా ఓటమి పాలైయ్యారు. తుమ్మల జీవితానికి కొద్ది కాలం విశ్రాంతి లభించింది కాని జిల్లా తో పాటు పాలేరు ప్రజలకు అభివృద్ధి అందనంత దూరమయ్యింది. ప్రత్యేక ప్రణాళిక లేకపోవటంతో పాటు అనేక పనుల్లో అవగాహాన లేనందునా అసంపూర్తి పనులతో పాటు శాశ్వత సమస్యలు పరిష్కారం కావడం లేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.

40 యేళ్ల రాజకీయ ప్రయాణంలో ఎన్నికల కోసం డబ్బు ఖర్చు పెట్టకుండా , కేవలం డబ్బు, పదవి మాత్రమే ఎజెండాగా పెట్టుకోకుండా పని చేసిన నాయకుడు తుమ్మల. ఉమ్మడి రాష్ట్రంలో, ప్రత్యేక రాష్ట్రంలో అనేక రోడ్లు , నీటి వినియోగ ప్రణాళికలు రూపొందించిన వ్యక్తిగా తుమ్మలకు రికార్డుల్లో పేరు నమోదు చేసుకున్నారు.

బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ విజయవంతం చేసేందుకు ట్రబుల్ షూటర్ గా పేరున్న మంత్రి హరీష్ రావు ముందుగానే ఖమ్మం జిల్లాకు చేరుకున్నారు. ఇక్కడి పరిస్థితుల గురించి ముందుగానే రిపోర్ట్ తెప్పించుకున్న మంత్రి ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులతో కలిసి నేరుగా తుమ్మల ఇంటికి వెళ్లారు. బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ విజయవంతం అయ్యేందుకు తోడ్పాటునివ్వాలని , ముందుండి పనుల్లో చురుగ్గా పాల్గొని సభ విజయవంతం చేసే బాధ్యతను భుజస్కంధాలపై పై మోయాలని కోరడంతో తుమ్మల సభను సక్సెస్ చేసేందుకు నడుం బిగించారు.

జిల్లా నాయకులతో కలిసి అందరిని సమన్వయం చేసుకుంటూ వారి వారి సలహాలు తీసుకొని , విలువైన సలహాలు సూచనలు ఇస్తూ సభను విజయతీరానికి చేర్చారు. హైదరబాద్ కేంద్రంగా పని చేస్తున్న మీడియా దృష్టి మొత్తం తుమ్మల వైపు మళ్లింది, తుమ్మల రాకతో బిఆర్ఎస్ ఆవిర్భావ సభ మరో స్థాయికి చేరింది.

ఎన్నో సందర్భాల్లో తుమ్మల ముఖ్యమంత్రి కేసిఆర్ని తన ప్రాణ స్నేహితుడిగా అభివర్ణిస్తూ గతంలో కేసిఆర్ తో పని చేసిన అనుభూతులను పరచుకుంటారు. కేసిఆర్ కు తోడు నిలవడం బాధ్యతగా భావిస్తారు. పదవులు ఇస్తే మనోడు , ఇవ్వకుంటే పగోడుగా చెప్పుకునేతత్వం లేకపోవడమే ముఖ్యమంత్రి కేసిఆర్ కు తుమ్మల నాగేశ్వరరావులో నచ్చిన అంశం. ఏ సందర్భంలో కూడా ఎవరు ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేసిన , అవమానాలు చేసిన , వెన్ను పోట్లు పొడిచిన తుమ్మల ఓర్పుతో నేర్పుతో అంత ముఖ్యమంత్రి కేసిఆర్ చూసుకుంటారని భావించేవారు.

రాజకీయాల్లో ఉండాలంటే ఓపిక , సహనం ఉండాలి అవి లేకపోతే రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్తుంటారు తుమ్మల. తుమ్మల కంటే ముందు తుమ్మలతో పాటు అనేక మంది ఎంత వేగంగా వచ్చారో , అంతే వేగంతో కనుమరుగైయ్యారు. కాని తుమ్మల రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి నుంచి నేటి వరకు అదే స్థాయిని , ఫాలోయింగ్ ని కొనసాగిస్తున్నారు.

తుమ్మలకు ఉన్నతాధికారుల్లో చాలా గౌరవం ఉంది. తుమ్మల బిఆర్ఎస్ ఏర్పాట్లను పరిశీలిస్తూ , సభలో కనపడితే ప్రజలందరు నిండుతనంగా భావించారు. సభ సక్సెస్ చేయడంలో తుమ్మల కీలక పాత్ర పోషించారనే అంశాన్ని రాజధాని మీడియా కోడై కూసింది.

తుమ్మల నాగేశ్వరరావు కు ఉమ్మడి రాష్ట్రంలో గొప్ప పేరుంది. తనకు ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఉన్నత వర్గాల వారితో పాటు పారిశ్రామిక వేత్తలతో సన్నిహిత పరిచయాలున్నాయి. రేపు బిఆర్ఎస్ పార్టీకి తుమ్మల ఎంతో కీలకంగా మారే అవకాశం ఉందని కేసిఆర్ గ్రహించారు.

తుమ్మలకు ఉన్న అనుభవం , పరిచయాలు బిఆర్ఎస్ పార్టీకి బలంగా చేకూర్చనుంది. కాబట్టి రేపు తుమ్మలను ఎంఎల్ఎ కోటాలో ఎంఎల్ సి పదవి ద్వారా గౌరవించి క్యాబినెట్ స్థానం కలిపించి. ఉమ్మడి రాష్ట్రంలో తుమ్మలకు ఉన్న పరిచయాలను భారీ స్థాయిలో వినియోగించుకోవాలని కేసిఆర్ భావిస్తున్నట్లు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

తుమ్మలకు రాజకీయ అనుభవం ఒక పక్క అవినీతి మరకలు లేకపోవడంతో పాటు నాన్చుడు ధోరణి లేకుండా సూటిగా మాట్లాడి సమస్య పరిష్కారానికి మార్గం చూపే నాయకుడిగా పేరుపడటం అనేది తుమ్మలకు కలిసొచ్చే అవకాశం.

– వయ్యామ్మెస్ ఉదయశ్రీ

Leave A Reply

Your email address will not be published.

Breaking