Take a fresh look at your lifestyle.

సీఎం రేవంత్ రెడ్డికి టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవి అగ్నిపరీక్ష

0 33

టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవి సీఎం రేవంత్ రెడ్డికి అగ్నిపరీక్ష

  • కేసీఆర్ ప్రభుత్వంలో కాంగ్రెస్ మీద కక్ష గట్టిన మాజీ డీజీపీ
  • విదేశాలలో రేవంత్ ఉండగా మాజీ డీజీపీ ఫైనల్..?
  • మహేందర్ రెడ్డి ‘కొండరెడ్డి’ ఎస్ టీ సర్టిఫికెట్ తో చదివారా..?
  • కర్నూల్ ఎస్ పీ గా ఉన్నప్పుడు ఏసీబీ కేసు..?

(యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్)

’‘కేసీఆర్ కు బానిసలా బతుకడం డీజీపీ మహేందర్ రెడ్డి నీకు అవసరమా..? మరో ఏడాదిలో రిటైర్డ్ అవుతావ్. నిష్పాక్షికంగా పని చేయు. పీసీసీ చీఫ్ గా నేను ఫోన్ చేస్తే మాట్లాడావా..? అంత బలుపా.. అంకారమా..? దొరకు బానిసలా పని చేస్తే ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇంగీత జ్ఞానం ఉందా..? బీఆర్ ఎస్ కాలు కింద చెప్పులా పోలీసులను మార్చిన నీకు సిగ్గులేదా..? సిగ్గు శరం లేని నీదో బతుకెేనా..? పోలీస్ జాబ్ వదిలి పెట్టి బ్రోకర్ గా పని చేయు.. ఇంకెంతో కాలం కేసీఆర్ సీఎం గా ఉండడు. గుర్తుంచుకో..’’ అంటూ ఏడాది కింద మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి మండి పడ్డారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవి కోసం మహేంధర్ రెడ్డి దరఖాస్తు చేసుకోవడంతో ఈ వీడియో నేడు వైరల్ అవుతుంది.

సీఎం రేవంత్ రెడ్డి

మహేందర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్ వీడియో లింక్.. 

టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి కోసం మాజీ డీజీపీ

టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అగ్నిపరీక్షలా మారింది. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్నరాజ్యాంగబద్దమైన పదవి ఇది. అలాంటి అత్యున్నతమైన పదవి వివాదాలకు అతీతంగా ఉండే విద్యావేత్తలకు ఇవ్వాల్సి ఉంది. కానీ.. వివాదస్పదుడిగా ముద్రపడిన మహేందర్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో సోషల్ మీడియాలో వివిధ పోస్ట్ లు వైరల్ గా మారుతున్నాయి. గతంలో కర్నూల్  ఎస్ పీ గా పని చేసిన మహేందర్ రెడ్డిపై వాహణాల రిపేర్ విషయంలో ఏసీబీ కేసు నమోదైందని,  అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం సర్వేల్ గ్రామంలో గురుకుల ఆశ్రమ పాఠశాలలో మహేందర్ రెడ్డి ‘కొండరెడ్డి’ కులం పేరుతో ఎస్ టీ కుల సర్టిఫికెట్ పొంది విద్యనభ్యసించినట్లు ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెసోళ్లను వేదించినోళ్లకు పదవులా..?

కేసీఆర్ పాలనలో కాంగ్రెస్ పార్టీపై కక్షగట్టి వేదించినోళ్లు ఇప్పుడు అత్యున్నతమైన పదవిపై కన్నేసిండ్రు. కేసీఆర్, కేటీఆర్ మెప్పు కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నిరుద్యోగ యువతకు నరకం చూపించిన ఐపీఎస్ లు కూడా టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు.

విదేశాలలో రేవంత్.. మాజీ డీజీపీ ఫైనల్..?

కేసీఆర్ ప్రభుత్వంలో డీజీపీ మహేంధర్ రెడ్డి పనితీరుపై పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫైర్ అయిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీ వైరల్ అవుతున్నాయి. డీజీపీగా పదవీ విరమణ పొందిన మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే వివాదానికి కేంద్ర బింధువుగా మారిన టీఎస్పీఎస్సీ లో వివాదాలకు అతీతంగా, నిజాయితీగా విధులు నిర్వహించే అనుభవజ్ఞులను నియామిస్తే బాగుంటుందానేది విద్యావంతుల అభిప్రాయం.

నిజాయితీ పరులకే రేవంత్ పోస్టింగ్ లు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజాయితీగా విధులు నిర్వహించే వారికి ఉన్నత పదవులు అప్పగిస్తున్నారు. డీజీపీ రవిగుప్తా, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఇంటిలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, పోలీసు కమీషనర్ లు శ్రీనివాస్ రెడ్డి, అవినాష్ మహంతి, సుదీర్ బాబు ఇలా నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ పొలిటికల్ ఫైరావీలను పట్టించుకోని ఆఫీసర్ లకు పోస్టింగ్ లు ఇస్తున్నారు. అయితే.. కేసీఆర్ ప్రభుత్వంలో డీజీపీగా మహేందర్ రెడ్డి పోలీసులను బీఆర్ ఎస్ కార్యకర్తలుగా మార్చారని రేవంత్ రెడ్డి ఫైర్ అయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేందర్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంలో ఏక పక్షంగా విధులు నిర్వహించారని నేటి సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో హెచ్చరించారు.

దరఖాస్తులను పరిశీలించిన సెర్చ్ కమిటీ

ఇప్పటికే మాజీ డీజీపీ మహేంధర్ రెడ్డి పేరును గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగానే  సెర్చ్ కమిటీ టీఎస్పీఎస్సీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సీఎం చైర్మన్ పదవికి 50కి పైగా దరఖాస్తులు.. సభ్యుల పదవులకు 320 వచ్చాయి.

అయితే.. సీఎం రేవంత్ రెడ్డికి టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవి అగ్ని పరీక్షలా మారింది. మాటకు కట్టుబడి ఉండే అతను  మహేందర్ రెడ్డి గురించి అన్నీ తెలిసి అత్యున్నతమై పదవిని అంటగడుతారా.. లేక నిజాయితీగా విధులు నిర్వహించే వారికి నియామిస్తారానేది ఎదురు చూడాల్సిందే.

మల్లేష్ యాటకర్ల

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking