Take a fresh look at your lifestyle.

బీజేపీకి బై.. కాంగ్రెస్ గూటికి జై.

0 16

బీజేపీకి బై.. కాంగ్రెస్ గూటికి జై..
– వివేక్ వెంకటస్వామి మళ్లీ పార్టీ మారాడు
– కేసీఆర్ ప్రభుత్వం దించడానికి మారాడట..
నిర్దేశం, హైదరాబాద్ :
గడ్డం వివేక్.. మాజీ ఎంపీ. పొలిటికల్ గా పుల్ బిజీ.. కానీ.. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఆ దేవుడికి కూడా తెలియదచ్చు. మొన్న కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు.. నిన్న టీఆర్ ఎస్ నుంచి బీజేపీకి.. ఈ రోజు బీజేపీ నుంచి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి.‘‘ఔను.. నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం స్వంత ఇంటికి వచ్చినట్లుగా ఫీలవుతున్నాను.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని దించడమే నా ముందున్న లక్ష్యం..’’ అంటూ మీడియా ముందు పేర్కొన్నారు గ్రేట్ పొలిటికల్ లీడర్ వివేక్.2019లో బీఆర్ ఎస్ లో వివేక్ కు పార్లమెంట్ కు పోటీ చేయడానికి టికెటు ఇవ్వలేరు.. అంతే.. కోపంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఆ సమయంలో ఆ పార్టీ బీఆర్ ఎస్ కు తగిన బుద్ది చెబుతాదనే ఫీలింగ్ ప్రజలలో ఉండే. కానీ.. అధిష్ఠాన వర్గం బీఆర్ ఎస్ పట్ల మెతక వైఖరితో ఉండటం.. ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేసీఆర్ కూతురు కవితను అరెస్టు చేయక పోవడం వల్ల స్టేట్ లో బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. బీజేపీ – బీఆర్ ఎస్ ఒక్కటే అనే వాయిస్ జనంలోకి వెళ్లింది.
తాజా పరిస్థితులలో బీఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ అనేది జగమెరిగిన సత్యం. అసెంబ్లీ ఎన్నికలలో సీఎం కేసీఆర్ ను ఓడించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అనే వరకు ప్రజల్లోకి వెళ్లిందని నిజం తెలుసుకున్న వివేక్ బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ మేనిఫెస్టో కమిటీతో పాటు బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా లేఖను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు.
అయితే.. వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీ చెన్నూర్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నారనేది టాక్.
ఇంతకు ఈ కాంగ్రెస్ పార్టీలో వివేక్ వెంకటస్వామి ఎంత కాలం ఉంటారని సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking