Take a fresh look at your lifestyle.

రోజురోజుకు పడిపోతున్న బిఆర్ఎస్ గ్రాఫ్, అంతకంతకు పెరుగుతున్న కాంగ్రెస్ గ్రాఫ్

0 14

  సీఎం కేసీఆర్ కు సర్వేల షాక్
— అధికారంలోకి కాంగ్రెస్
— బిఆర్ఎస్ 20 -25
— కాంగ్రెస్ 80- 90
— బిజెపి 5- 8
— ఎంఐఎం 7 – 8
— ఇతరులు 0-1

— బండి తొలగింపుతో పడిపోయిన బిజెపి గ్రాఫ్

— 10 ఏళ్ల పాలనపై మొహం మొత్తిన తెలంగాణ ప్రజలు

— ఏ ఆర్ మీడియా, ఏషియన్ మీడియా సర్వేలో షాకింగ్ నిజాలు

– ప్రైవేట్ సర్వే సంస్థలు, ఇంటెలిజెన్స్ నివేదికలు ఒకే తీరుపై సర్వత్ర ఆసక్తి

(కొండం అశోక్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్)

బిఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన తీరుపై తెలంగాణ ప్రజలకు మొహం మొత్తింది… తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎన్ని ప్రవేశపెట్టినా, అవి, బిఆర్ఎస్ పార్టీకీ హ్యాట్రిక్ విజయాన్ని అందించలేకపోతున్నాయి.. ఒకే పార్టీ .. ఒకే ఎమ్మెల్యే.. ఒకే పరిపాలన తీరు… ఒకే నినాదం.. అనే తీరుపై రాష్ట్ర ప్రజలు బేజారెత్తిపోయారు .. ఇంకా ఎంతకాలం ఈ పాలన..? ఇకనైనా మార్పు అవసరమని భావిస్తున్నట్టు వెల్లడైంది.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని, అందుకే , మళ్ళీ ప్రజలంతా తమకే పట్టం కడతారని బలంగా నమ్ముతున్న నేపథ్యంలో నిర్వహించిన సర్వేల్లో ఫలితం అందుకు భిన్నంగా రావడం షాక్ కు గురిచేస్తుంది.

సర్వే వివరాలు ఇలా..

ఇటీవల ఏఆర్ మీడియా, న్యూఢిల్లీకి చెందిన ఏషియన్ మీడియా సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో పలు రకాల ఆసక్తికర విషయాలు వెళ్లడయ్యాయి… ఈ సర్వే సంస్థలకు సమానంగా రాష్ట్ర ఇంటలిజెన్స్ నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. రెండిటిని బెరీజు వేసుకుంటే సర్వే రిపోర్ట్ సరైందేనని రాష్ట్ర ప్రభుత్వానికి నమ్మక తప్పని పరిస్థితి ఎదురవుతుంది ..ఈ నివేదికల ఆధారంగా, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా తన అనుచర వర్గంతో కూడిన, ప్రైవేట్ సర్వే సంస్థలను కూడా రంగంలోకి దింపినట్లు సమాచారం… ఏ ఆర్ మీడియా, ఢిల్లీకి చెందిన ఏషియన్ మీడియా సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో 500 మంది పాల్గొన్నారు … ఒక్కో ఉమ్మడి జిల్లాకు 50 మంది చొప్పున జూలై మొదటి వారం నుంచి 20వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాయి…

ఈ సర్వేలో 3 విభాగాలుగా విభజించి అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నాయి.. మొదటగా యువత, రెండవదిగా మధ్యతరగతి వయస్సు 40 నుంచి 65 వరకు, మూడవదిగా 65 నుంచి పెన్షన్లు అందుకునే వయసు వారిని పలు రకాల ప్రశ్నలతో సర్వే నిర్వహించింది.. ఈ సర్వేలో యువతతో పాటు ఉద్యోగస్తులు, మధ్య వయస్కులు పూర్తిగా అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా సమాధానాలు ఇచ్చారు… కొంతమంది పెన్షనర్లు మాత్రం బి ఆర్ ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడారు.. విద్యాధికులైన మరికొంతమంది పెన్షనర్లు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంపై పూర్తిస్థాయిలో పెదవి విరిచారు.. అన్ని రకాల వస్తువుల పై ధరలు పెంచి, ముక్కు పిండి వసూలు చేసిన ఆదాయాన్ని మళ్లీ పింఛన్ల రూపంలో అందించడం ఏమంత గొప్ప కాదని వెల్లడించారు.. ఇలా అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సర్వే లో తెలుసుకోవడం జరిగింది..

భారీగా పడిపోతున్న బిఆర్ఎస్ గ్రాఫ్:

ముఖ్యమంత్రి కేసీఆర్ అంచనాలకు భిన్నంగా ఆ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు భారీగా పడిపోతుంది .. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో భాగంగా బిఆర్ఎస్ పార్టీ ప్రజల్లో బలమైన నమ్మకాన్ని రోజురోజుకు కోల్పోతుంది.. వీటన్నిటికీ ప్రధాన కారణాలుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఘనకార్యాలు ప్రజలను వేధింపులకు గురిచేస్తుంది.. ముఖ్యంగా అవినీతి అక్రమాలు, రియల్ ఎస్టేట్ దందాలు,, సెటిల్మెంట్లు, పోలీస్ పైరవీలు వంటి వాటితో ప్రజలను చిత్రహింసలకు గురి చేయడం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయింది.. మళ్ళీ సిట్టింగ్ లకే సీట్లు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో, ప్రజలు మరింత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు .. పదేళ్లుగా ఒకే ఎమ్మెల్యే.. ఒకే పరిపాలన విధానం, అదే అరాచక పాలన.. వంటి వాటిని ఇక మళ్ళీ ఐదేళ్లపాటు భరించలేమని వెల్లడించారు..

కారు జోరు అంతంత మాత్రమే:

ఉత్తర, దక్షిణ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ కారు జోరు నామమాత్రం కాబోతుంది.. ఇప్పటివరకు ఉత్తర తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి తిరుగులేని ప్రజల ఆమోదముద్ర ఉండేది.. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి తిరగబడింది.. ప్రధానంగా బిఆర్ఎస్ కు ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ లలో గట్టిపట్టు ఉండేది.. అయితే, ప్రస్తుతం ఈ ఒక్కో జిల్లాలో కేవలం, రెండు నుంచి మూడు సీట్లకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి.. ప్రధానంగా కరీంనగర్ జిల్లాలో ఒక్క సీటు మాత్రమే టిఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంది.. అది కూడా హోరాహోరి పోరు ఉంటుంది..
ఇక నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా వచ్చే అవకాశాలు లేనట్లు వెళ్లడైంది.. ఈ నాలుగు జిల్లాల్లో బిఆర్ఎస్ పార్టీకి కేవలం 6నుంచి10 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నట్లు సర్వే నివేదిక చెబుతుంది..

అంతగా పని చేయని సంక్షేమం పథకాలు:

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు రకాల సంక్షేమ పథకాలు అంతగా ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నాయి.. ప్రధానంగా రైతుబంధు, రైతుబీమా పథకాల పట్ల వ్యవసాయదారులు మక్కువ చూపెట్టడం లేదు …. ఎందుకంటే , రైతుబంధు పథకం ద్వారా ఎకరాకి రూ. 10వేల చొప్పున ఇవ్వడం పట్ల కొంత సానుకూలత ఉన్నప్పటికీ పెద్దగా రైతులు సానుకూలంగా స్పందించకపోవడం గమనార్హం.. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం, రైతు కూలీల ధరలు పెరిగిపోవడం, పండించిన పంటకు మార్కెట్లలో తరుగు పేరుతో దగా చేయటం, వంటి వాటి వల్ల రూ. వేలల్లో నష్టపోవాల్సి వస్తుంది .. వీటిని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

ఈ దిశగా ప్రభుత్వం అంతగా పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు… అలాగే రైతు బీమా అనేది పెద్దగా ప్రయోజనాన్ని అందించలేక పోతుంది.. రైతు బతికుండగానే ఈ ఆర్థిక సాయం అందితే బాగుంటుంది.. కానీ, రైతు చనిపోయిన తర్వాత బీమా ఇవ్వడం ఏమిటని తీవ్ర సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.. రైతు బీమా బదులు పంటల బీమా ఇస్తే బాగుండేదని 90% రైతులు సూచిస్తున్నారు… పంటల బీమా ఉన్నట్లయితే పంట పండితే రైతుకు లాభం. ఒకవేళ కరువు కాటకాలు, ఇతరత్రా అవాంతరాలు వచ్చి పంటలు పండకపోతే భీమా కంపెనీల నుంచి పరిహారం వస్తుంది .. ఇక, రైతు నష్టపోయే అవకాశం లేదు.. కావున, ప్రభుత్వమే పంటల బీమా మొత్తాన్ని చెల్లించి, రైతులకు అండగా ఉండే నిర్ణయం తీసుకుంటే మేలు జరుగుతుందనే భావన వ్యవసాయదారుల నుంచి వెళ్లడైంది..

కులాల పేరుతో డబ్బులు ఇవ్వడం సరైనది కాదు:

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో బీసీ కులాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చొప్పున అలాగే మైనార్టీ వర్గాలకు కూడా ఆర్థిక సాయం అనే అంశాన్ని తెరపైకి తేవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది… ఎందుకంటే కులాల పేరుతో ఆర్థిక సాయం చేయడం ఎంతవరకు సమంజసం ..? అంటూ, ఈ ఆర్థిక సాయం అందని ఇతర కులాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది… దీని వల్ల కూడా బిఆర్ఎస్ పార్టీ కి కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి.. ఉచితాలు అనేవి తాత్కాలికమైవని, ఇదే మొత్తంతో దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయని ప్రజలు భావిస్తున్నారు..

సీనియర్ జర్నలిస్టులతో ముప్పు:

ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీకి సీనియర్ జర్నలిస్టులతో ముప్పు పొంచి ఉన్నట్లు సర్వేలో వెళ్లడైంది.. దీనికంతటికి ప్రధాన కారణం బిఆర్ఎస్ పార్టీ అధినేత జర్నలిస్టుల ఇంటి స్థలాలపై దృష్టి కేంద్రీకరించకపోవడమేననే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.. జె ఎన్ జె హౌసింగ్ సొసైటీ కి సంబంధించి సుమారు 1100 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది.. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్లక్ష్య ధోరణి వహించడం వల్ల జర్నలిస్టులంతా పోరుబాట పట్టారు.. ఇది కాస్త చిలికి చిలికి గాలి వానగా మారి, బిఆర్ఎస్ పార్టీకి తీవ్రంగా నష్టం కలిగించే అంశంగా మారబోతుంది.. సీనియర్ జర్నలిస్టులంతా 2008లో అప్పటి మార్కెట్ రేట్ ప్రకారం స్థలాలకు డబ్బులు చెల్లించేందుకు ఒక్కొక్కరు రూ. 2 లక్షలు చొప్పున కట్టారు.. అయితే, ఆనాటి పరిస్థితులలో జర్నలిస్టుల వద్ద డబ్బులు లేని కారణంగా ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి జమ చేసి భూమిని కొనుగోలు చేశారు.

ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంటి స్థలం వస్తుందని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు .. ఈ ఎదురు చూపుల్లో దాదాపు 65 మంది జర్నలిస్టులు మృత్యువాత పడ్డారు.. ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. అనేకమంది నిరుద్యోగులుగా మారిపోయారు.. ఇంకా 50 శాతం మంది ఉద్యోగాలు చేస్తున్నారు.. ఇంటి స్థలాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బిజెపి మద్దతును కూడగట్టాయి. ఎన్నికల నోటిఫికేషన్ లోపల జర్నలిస్టులకు ఇంటి స్థలాలను స్వాధీనం చేయకుంటే, రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా దాదాపు 500 వందల యూట్యూబ్ ఛానల్ లను ఏర్పాటు చేయడం, మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం లలో 20 నుంచి 30 మంది జర్నలిస్టులు నామినేషన్ వేయడం, బిఆర్ఎస్ పార్టీ ప్రధాన నేతలు చేస్తున్న ప్రచార కార్యక్రమాల్లో నిరసన ప్రదర్శనలు చేయడానికి సంసిద్ధమయ్యారు.. ఢిల్లీ జంతర్ మంతర్ లో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీకి జర్నలిస్టులు దూరమవడమే కాకుండా, పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆశపెట్టి ఇప్పటివరకు వాటిని అమలు చేయకుండా దాటవేత ధోరణి అవలంబించడం వల్ల వాళ్లంతా వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి.. వీటన్నిటిని అధిగమించి జర్నలిస్టుల పట్ల సానుకూలంగా వ్యవహరించినట్లయితే నష్టాన్ని కొంతమేరకు నివారించవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది…

అమాంతం పెరిగిన కాంగ్రెస్ గ్రాఫ్:

తెలంగాణ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి రోజురోజుకు ఆ పార్టీ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోతుంది కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరిగిన ఆదరణ తో దాదాపు 80 నుంచి 90 సీట్లలో విజయం సాధించవచ్చు అని సర్వే ఫలితాలు వెల్లడించాయి.. ప్రధానంగా ఆ పార్టీ ఇప్పటివరకు తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు పాజిటివ్ గా స్వీకరిస్తున్నారు… ఇప్పటికే వ్యవసాయ డిక్లరేషన్.. యూత్ డిక్లరేషన్ వంటి కార్యక్రమాలతో ప్రజల అభిమానాన్ని చూరగొంటుంది.. ఈ నెలాఖరున ప్రియాంక గాంధీతో కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ,, ఆగస్టు 15న ఎస్సీ ,ఎస్టీ కాంగ్రెస్ గర్జన సభను ఏర్పాటు చేస్తుంది.. అన్ని వర్గాల ను ఆకట్టుకునే విధంగా ప్రణాళికతో ముందుకు సాగుతోంది..
అలాగే వైయస్సార్ తెలంగాణ షర్మిల పార్టీ , తెలంగాణ జన సమితి ప్రొఫెసర్ కోదండరాం పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తున్న క్రమంలో మరింతగా కాంగ్రెస్ పార్టీ ఆదిత్యాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి..

తెలంగాణ కాంగ్రెస్సే ఇచ్చింది:

తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని, ఆ పార్టీని ఒకసారి అధికారంలోకి తీసుకురావాలని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు … 60 ఏళ్లుగా వలస పాలకుల చేతిలో తెలంగాణ ప్రజలు అఅనగా అన గదొక్కబడ్డారని ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితుల నుంచి ప్రత్యేక రాష్ట్రం సాధన తో ఒకసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఇలాంటి మార్పును తెచ్చిన, ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తేవడం పై అన్ని వర్గాల ప్రజలు దృష్టి సారించినట్లు సర్వేలో వ్యక్తం అయింది.. ప్రధానంగా యువత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుంది.. ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్న యువత కాంగ్రెస్ వైపు మల్లుతోంది…

కాంగ్రెస్ పథకాలకు ఆదరణ:

ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది… ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధిక ధరల నియంత్రణ హామీ, రూ. 500 కే గ్యాస్ సిలిండర్, రైతులకు ఏక మొత్తంలో రూ. 2 లక్షల రుణమాఫీ, రైతుబంధు 15 వేలకు పెంపు, రైతులకు పంటల భీమా, 8 నిరుద్యోగ భృతి, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ. 25 వేల పింఛన్ , “జయ జయహే తెలంగాణ” అనే తెలంగాణ గీతాన్ని అధికారిక గీతంగా గుర్తించడం..


ప్రతి ఏటా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు .. నిరుద్యోగ , ఉద్యోగ క్యాలెండర్ ప్రకటన, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజలు సుముఖత వ్యక్తం చేశారు.. దీంతో ఆ పార్టీ ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పూర్తిస్థాయిలో ఆధిక్యంలో కొనసాగుతుంది.. ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్ , వరంగల్, ఆదిలాబాద్ , నిజామాబాద్, మెదక్ జిల్లాలో 80 శాతం ఆదిత్యాన్ని ప్రదర్శిస్తుంది. అలాగే ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో 90 శాతం ఆదిత్యాన్ని ప్రదర్శిస్తుంది… కాగా ,హైదరాబాద్ జంట నగరాల్లో మాత్రం కొంత వెనుకబడింది .. ఇక్కడ బిఆర్ఎస్ తో పాటు బిజెపి కొంత ఆధిపత్యాన్ని కనబరుస్తోంది.. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 80 నుంచి 90 స్థానాలు సాధించే అవకాశాలు ఉన్నట్లు సర్వే లో తేలింది.

వెనుకబడ్డ బిజెపి:

రెండు నెలలు క్రితం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికార బి ఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రజలు గుర్తించారు.. కేవలం రెండు నెలల్లోనే ఆ పార్టీ పరిస్థితి తలకిందులైపోయింది.. బిఆర్ఎస్ పార్టీని ఎదుర్కునే దమ్ము ధైర్యం ఉన్న పార్టీగా బిజెపి విస్తృత ప్రచారాన్ని చేసుకుంది. అయినప్పటికీ, దానిని అమలు చేయడంలో పూర్తిస్థాయిలో విఫలం చెందడం వల్ల బిజెపికి ప్రజల్లో ఆదరాభిమానాలు తగ్గిపోయాయి.. స్వయంగా భారతీయ జనతా పార్టీ అధినేతలైన ప్రధాని నరేంద్ర మోడీ , కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి వచ్చి , సీఎం కేసీఆర్ ఆయన కుటుంబం అంతా అవినీతికి పాల్పడుతున్నారని పరుశమైన పదజాలంతో దూషించారు. బండి సంజయ్ కూడా అధికార బిఆర్ఎస్ పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. అవినీతి ఆరోపణలు చేసిన కేంద్ర ప్రభుత్వం లోని పెద్దలు కేసీఆర్ కుటుంబం పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అయింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. త్వరలోనే కవితను అరెస్ట్ చేస్తారని బిజెపి నేతలు స్వయంగా ప్రకటించారు. అయినప్పటికీ, కవిత ఈ కేసులో అరెస్ట్ కాలేదు. అలాగే బిఆర్ఎస్ నేతల అవినీతి ఆరోపణలపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ దుందుడుకుగా వ్యవహరిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఈ సందర్భంలోనే బిజెపి కేంద్ర నాయకత్వం బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. దీంతో ఒక్కసారిగా బిజెపి గ్రాఫ్ పడిపోయింది.. తాజాగా నిర్వహించిన ఈ సర్వేలో భారతీయ జనతా పార్టీకి కేవలం 5 నుంచి 8 సీట్లు మాత్రమే లభించే అవకాశాలు ఉన్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా గెలిచే అవకాశాలు లేవు .. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెతక వైఖరి వల్ల పార్టీ మరో పదేళ్లు వెనుకబడి పోయిందని సర్వేలో వెళ్లడైంది… గతంలో మూడుసార్లు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంగా పార్టీని ఏమాత్రం విస్తరించలేకపోయారని విమర్శలున్నాయి.. పైగా, బిఆర్ఎస్ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల , పార్టీని దూకుడుగా ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు భావిస్తున్నారు.

బిజెపి, బిఆర్ఎస్ ఒక్కటే:

బీజేపీ, బిఆర్ఎస్ పార్టీ ఒకటేనని, ఇరు పార్టీలు లోపాయి గారి ఒప్పందం ప్రకారం వ్యవహరిస్తున్నట్లు ప్రజలు చెప్తున్నారు.. గత కొంతకాలంగా బి ఆర్ ఎస్, బిజెపి నేతలు లోపాయకారి ఒప్పందాలు చేసుకోవడం వల్లనే ఇరు పార్టీల నేతలు పైకి దూషణలు, లోలోన స్నేహ హస్తాలు అనే విధంగా వ్యవహరిస్తున్నాయి అన్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు … ఒకప్పుడు బిఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం బిజెపి మాత్రమేనని నమ్మిన ప్రజలు, ప్రస్తుతం, ఈ రెండు పార్టీలు ఒకటేనని చెప్పడం విశేషం.. ప్రస్తుత బిజెపి కి సంబంధించి పడిపోయిన గ్రాఫ్ మొత్తం కాంగ్రెస్ వైపు మళ్ళింది.. అలాగే బిఆర్ఎస్ వ్యతిరేక ఓటు కూడా కాంగ్రెస్ వైపు వెళ్లడంతో ఆ పార్టీ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగిపోయింది.
ఎప్పటిలాగానే రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ తన ఆధిపత్యాన్ని 7 నుంచి 8 స్థానాల్లో కొనసాగిస్తుంది.. . కాగా, ఎంఐఎం పార్టీ ఈసారి ఎక్కువ స్థానాల్లో పోటీ చేసినట్లయితే కొంత కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటికి అవకాశాలు ఉన్నాయి. అనాదిగా ముస్లిం మైనార్టీ వర్గాలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటూ వస్తున్నాయి. అయితే, ఈసారి ఎంఐఎం ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తే మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఏ మేరకు పోటీ చేస్తుందనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇక రాష్ట్రంలో బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలు నామ మాత్రమే .. కమ్యూనిస్టు పార్టీలు ప్రస్తుతం అధికార బిఆర్ఎస్ వైపు తోక పార్టీలు గా ఉన్నాయి.. వాళ్లు బిఆర్ఎస్ ఇచ్చే ఒకటి అర సీట్ల కోసం ఆబగా ఎదురుచూస్తున్నాయి.. వీటి ప్రభావం ప్రజలపై అంతగా చూపడం లేదనేది ఈ సర్వేలో వెళ్లడైంది…

Leave A Reply

Your email address will not be published.

Breaking