Take a fresh look at your lifestyle.

ఆఫీస్ స్పేస్ కు హైదరాబాదలో భల్లే.. భల్లే

0 14

ఆఫీస్ స్పేస్ కు హైదరాబాదలో భల్లే.. భల్లే

హైదరాబాద్, జూన్ 6 : హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ మార్కెట్కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ విషయంలో బెంగళూరును వెనక్కి నెట్టింది. అనరాక్ నివేదికలో ఈ విషయం తెలిసింది 2023 ఆర్థిక ఏడాదిలో కమర్షియల్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ మిశ్రమ ప్రదర్శన కనబరిచింది. మొదటి భాగంలో కనిపించిన జోరు.. రెండో భాగంలో కనుమరుగైంది. ఆనరాక్ డేటా ప్రకారం.. ఈ ఆఫీస్ స్పెస్ విషయంలో హైదరాబాద్ దూసుకెళుతోంది. బెంగళూరును వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. అంటే.. 2023 ఆర్థిక ఏడాదిలో, దేశంలో ఎక్కడా లేనంత విధంగా హైదరాబాద్లో కమర్షియల్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ వృద్ధిని సాధించింది!హైదరబాద్లో గత ఆర్థిక ఏడాదిలో 14.94 మిలియన్ స్క్వేర్ ఫీట్ ప్రాంతం ఆఫీస్ స్పేస్కు వినియోగించుకున్నారు.

దేశంలోని టాప్ 7 నగరాల్లో హైదరాబాద్ వాటా 31శాతంగా ఉండటం విశేషం. ఇక అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోల్చుకుంటే.. ఈసారి ఆఫీస్ సప్లై 27శాతం వృద్ధి సాధించింది. బెంగళూరులో 12.66 మిలియన్ స్క్వేర్ ఫీట్ మాత్రమే ఆఫీస్ సప్లైగా వెళ్లింది. టాప్ 7 నగరాల్లో దీని వాటా 26శాతంగా ఉంది. ఇక అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోల్చుకుంటే. ఇది 13శాతం తక్కువగా ఉండటం గమనార్హం.ఎఫ్వై23లో ఎన్సీఆర్ ప్రాంతంలోని 8.82 మిలియన్ స్క్వేర్ ఫీట్(52శాతం వార్షిక వృద్ధి), ముంబై మెట్రోపాలిటిన్ రీజియన్లో 4.18 మిలియన్ స్క్వేర్ ఫీట్ను (46శాతం తక్కువ) కొత్త ఆఫీస్ సప్లై కింద వాడుకున్నారు. వాస్తవానికి ఎఫ్వై23 తొలి భాగంలో ఆఫీస్ రియల్ ఎస్టేట్ శక్తివంతంగా వృద్ధిచెందింది.

కానీ అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనశ్చితి వంటి కారణాలతో వృద్ధి కొనసాగలేకపోయిందని అనరాక్ గ్రూప్ డైరక్టర్, హెడ్ ప్రశాంత్ థాకూర్ వెల్లడించారు.”ఆఫీస్ స్పేస్ మార్కెట్ ఎఫ్వై24 తొలి భాగంలోనూ నెమ్మదించే అవకాశం ఉంది. అనేక ఐటీ కంపెనీలు వ్యాపారాన్ని విస్తరించుకోవడం లేదు. కాస్ట్ కటింగ్పైనే ఫోకస్ చేస్తున్నాయి. అందువల్ల దేశంలోని టాప్ 7 నగరాల్లో 2023 మొత్తం, 2024 తొలినాళ్ల వరకు కూడా ఆఫీస్ మార్కెట్ పెద్దగా ప్రదర్శన చేయకపోవచ్చు. 2024 రెండో భాగంలో కాస్త స్థిరత్వం వస్తుందని ఆశిస్తున్నాము,” అని ప్రశాంత్ థాకూర్ స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking