Take a fresh look at your lifestyle.

రూ.1500కోట్ల వడ్ల కుంభకోణం

0 16

రూ.1500కోట్ల వడ్ల కుంభకోణం

-రేవంత్ సర్కార్ అవినీతికి పరాకాష్ట

-తెలంగాణ నెత్తిపై కాంగ్రెస్ అవినీతి కత్తి

-డబుల్ ‘ఆర్’ ట్యాక్స్ లో ఫస్ట్

-ఆరు గ్యారెంటీలలో లాస్ట్

*కాంగ్రెస్ అంటేనే ఫాదర్ ఆఫ్ కర్పెక్షన్
మాజీ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నేత జీవన్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్13

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1500కోట్ల వడ్ల కుంభకోణానికి పాల్పడిందని ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూకాంగ్రెస్ అవినీతి పై ఈడీ, ఐటీ లకు పిర్యాదు చేస్తానని వెల్లడించారు.
గోదాముల్లో నిలువ ఉన్న ధాన్యాన్ని గ్లోబల్ టెండర్లు పిలిచి రూ 1600 కు చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మిందన్నారు.ఈ మొత్తం వ్యవహారం లో రూ 1450 కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన తెలిపారు. రేవంత్ సర్కార్ అవినీతికి పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ నెత్తిపై కాంగ్రెస్ అవినీతి కత్తి వేలాడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
డబుల్ ‘ఆర్’ (రాహుల్-రేవంత్ రెడ్డి) ట్యాక్స్ వసూళ్ళలో లో ఫస్ట్ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం
ఆరు గ్యారెంటీల అమలులో లాస్ట్ ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అంటేనే ఫాదర్ ఆఫ్ కర్పెక్షన్.
కాంగ్రెస్ హస్తం అవినీతి నేస్తం.
అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాదు. ఇండియన్ నేషనల్ కర్పెక్షన్ పార్టీ.జలయజ్ఞం,2జీ, భూపందారాలు, ఆగస్టా, కోల్-ఇలా పంచభూతాలను బోంచేసిన పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్, అవినీతి రెండూ రాహుకేతువులు లాంటివి. కాంగ్రెస్, కర్పెక్షన్ కవల పిల్లలు. కాంగ్రెస్
అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చింది.
తెలంగాణ ప్రజలను గాలికొదిలేసింది.
పైసా కమావో బాట పట్టింది. కాంగ్రెస్ అంటేనే ఎలెక్షన్, సెలక్షన్, కలెక్షన్.
ఆరు గ్యారెంటీలు బుట్ట దాఖల య్యాయి. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను గోతిలో పాటిపెట్టారు.
స్కీములు నిల్, స్కాములు ఫుల్.
బీ ఆర్ ఎస్ హయాంలో వడ్లు దేశమంతా ఎగుమతి అయితే కాంగ్రెస్ తెలంగాణ నుంచి ఓట్ల కోసం కోట్లాది రూపాయల నోట్లు ఎక్స్ పోర్ట్ చేస్తున్నది.
అవినీతి పాఠాల్లో కాంగ్రెసు కే ఫస్ట్ మార్క్. ఏ ఫర్ ఆదర్శ్. బీ ఫర్ బోఫోర్స్. సీ ఫర్ కామన్ వెల్త్ స్కామ్, డీ ఫర్ దేవాస్ యాంత్రిక్స్- ఇలా ఏ టూ జెడ్ కాంగ్రెస్ కరప్షన్ కహానీలే.
బోఫోర్స్ గన్నులు, టాటా ట్రక్కులు, ఆగస్టా హెలీ కాఫ్టర్లు ఇలా అన్నింట్లో కాంగ్రెస్ ఆవినీతే నిత్య దర్శనం. అవినీతి అమీబా కాంగ్రెస్. కాంగ్రెస్ డీ.ఎన్. ఏ లోనే కరప్షన్ ఉంది.

కాంగ్రెస్ పుట్టిన తరువాతే అవినీతి పుట్టింది. అందుకే ఒక పథకం ప్రారంభం కాక ముందే దానిలో ఎంత దోచుకోవచ్చో కాంగ్రెస్ నాయకులకు అవినీతి అంచనాలు ఉంటాయి.కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు,మంత్రులు, పీసీసీ అధ్యక్షులు-ఇలా కాంగ్రెస్ కండువా కప్పుకున్న ప్రతీ ఒక్కరూ కరప్షన్ కింగ్ లే. ప్రపంచంలో దేనికైనా రేట్ పెట్టి కొనగలిగే శక్తి ఒక్క కాంగ్రెస్ కే ఉంది. బార్డర్ లో సైనికులు ఉపయోగించే గన్నుల నుంచి పార్లమెంట్ లో ఎంపీల వరకూ కొన్న చరిత్ర కాంగ్రెస్ ది.
కాంగ్రెస్ అధినేత లు, యువనేతల అవినీతి కి పరాకాష్ట నేషనల్ హెరాల్డ్ కేసు.
కాంగ్రెస్ పాలకులు అధికార, ధన,పదవీ దాహం తీర్చుకున్నారు తప్ప ప్రజల దాహం తీర్చలేదు. కాంగ్రెస్ ఇప్పుడు రాజకీయంగా జాతీయ పార్టీ కాదు. వచ్చిన ఓట్ల ప్రకారం కొంచెం పెద్ద సైజ్ ప్రాంతీయ పార్టీ మాత్రమే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ, ముంబై నుంచి నార్త్ ఈస్ట్ దాకా అవినీతి ని విస్తరించడంలో మాత్రం కాంగ్రెస్ ముమ్మాటికీ జాతీయ పార్టీనే. అవినీతి డిక్షనరీలో మోబిలైజేషన్ అద్వాన్సులు,క్విడ్ ప్రోకో వంటి పదాలను పరిచయం చేసిందే కాంగ్రెస్ అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు.రాష్ట్రం లో స్కీం ల పాలన పోయి స్కాం ల పాలన వచ్చిందన్నారు.
ఢిల్లీ కి కప్పం చెల్లించేందుకు రేవంత్ అక్రమ దందాలు చేయడంలో బిజీగా ఉన్నారు.
నాలుగు నెలల్లోనే నలు దిక్కులా ల్యాండ్ స్కాం లు చేశారు.అవి ఒక్కొక్కటిగా త్వరలోనే వెలుగు చూస్తాయి.
కేంద్రం లో బీజేపీ రాష్ట్రం లో కాంగ్రెస్ దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాయి.
కాంగ్రెస్ అవినీతి పుట్ట ..వాళ్ళు నీతి గురించి మాట్లాడతారా?.
రేవంత్ నెంబర్ వన్ కరప్ట్ సీఎం.చెప్పేది ఒకటి చేసేదొకటి.
ఆర్ టీ ఐతో అప్పుడు బ్లాక్ మేయిల్ చేశాడు. ఇపుడు ఏకంగా సీఎం పదవిని బ్లాక్ మెయిల్ దందా ల కోసం వాడుకుంటున్నాడు.
మంత్రులకు అవినీతి చేసుకోవచ్చని పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు.
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ హై కమాండ్ కు డబ్బు సమకూరుస్తా అన్నందుకే రేవంత్ కు సీఎం పోస్టు వచ్చింది.

కేసీఆర్ హయం లో అభివృద్ధి సంక్షేమం జోడెడ్లలా నడిచాయి. కనుకే ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు తేగలిగాం.
తెచ్చిన తెలంగాణ ను కేసీఆర్ దేశం మెచ్చేలా తీర్చిదిద్దారు.
సొంత ఇంటిని చక్కదిద్దినట్టు కేసీఆర్ పదేళ్ల లో తెలంగాణ ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు.
కేసీఆర్ సాహసం తో ప్రణాళికలు వేసి కరెంటు భాధలు తీర్చారు. తాగునీళ్ల తండ్లాటకు సాగు నీళ్ల కష్టాలకు ముగింపు పలికారు. పదేళ్ల పాటు కేసీఆర్ పడ్డ కష్టం తో తెలంగాణ ఓ దారినపడ్డది. దేశమంతా తెలంగాణ అభివృద్ధి మోడల్ ను చర్చించుకునే స్థాయికి వెళ్ళింది. రైతు బంధును ఐక్య రాజ్యసమితి కూడా ప్రశంసించింది.
తెలంగాణ నీళ్ల కష్టాలు తీర్చారని తలపండిన నిపుణులు మెచ్చుకున్నారు. దార్శనికుడి సంకల్పం తో ఓ దారిన పడ్డ తెలంగాణ కాంగ్రెస్ చేతిలో పడి దగా పడ్డది.
అధికారం లోకి వస్తే చాలు అన్నట్టుగా కాంగ్రెస్ అమలు కు సాధ్యం కాని హామీలు ఇచ్చి గద్దె నెక్కింది. హామీలకు గ్యారంటీలనే ముద్దు పేరు పెట్టి కాంగ్రెస్ మాయ చేసింది.
వంద రోజుల్లోనే గ్యారంటీలను అమలు చేస్తామని నమ్మ బలికి నయవంచన కు పాల్పడింది.
కొత్త స్కీం లు తేవడం దేవుడెరుగు కేసీఆర్ స్కీం లు ఒక్కొక్కటిగా ఖతం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు పేదల నోట్లో మట్టి కొడుతున్నారు. కాంగ్రెస్ మోసాలకు ఈ నాలుగు నెలల్లో ఎక్కువగా నష్టపోయింది రైతులే.
రేవంత్ రెడ్డి రైతుల పాలిట రాబందు లా మారారు. ప్రజలు తమ చేతిలో మోసపోతుంటారని సీఎం కాకముందు చెప్పిన రేవంత్ రెడ్డి ఆ మాటలను అక్షరాల అమలు చేస్తున్నారు. రైతు భరోసా నుంచి పంటలకు బోనస్ వరకు రేవంత్ వన్నీ బోగస్ మాటలే. ఈ నాలుగు నెలల్లో రైతులు కంటినిండా నిద్ర పోయిన రోజులు లేవు. పంటను ఎలా దక్కించుకోవాలన్న పరేషాన్ లోనే రైతులు తమ సమయమంతా గడిపారు. ఎండిన పంటలతో భాధ పడ్డ రైతులు ఓ వైపు బాధపడుతుండగానే పండిన పంటలను సరైన మద్దతు ధరకు ప్రభుత్వం కొంటుందా అనే అనుమానాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగా పనిచేయక పోవడం తో రైతులు అడ్డీకి పావుశేరు లా ప్రైవేటు వారికి పంటను అమ్ముకుంటున్నారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎపుడైనా ఇలా జరిగిందా రైతులు ఆలోచించాలి. మద్దతు ధరకు 500 రూపాయలు బోనస్ కలిపి ఇస్తామని చెప్పి మద్దతు ధరను కూడా రేవంత్ ప్రభుత్వం ఇవ్వడం లేదు.
రైతుల పంటలకు మద్దతు ధర ఇవ్వని కాంగ్రెస్ కు రైతుల మద్దతు అవసరమా?.బోనస్ పై మాట తప్పిన కాంగ్రెస్ ను బొంద పెట్టాలా వద్దా?.
పార్లమెంటు ఎన్నికలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సురుకు పెట్టేందుకు వచ్చిన మంచి అవకాశం. వట్టి మాటలతో వ్యవసాయాన్ని ముంచిన కాంగ్రెస్ ను ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఓటు అనే ఆయుధం తో ముంచాల్సిందే.
నోరు తెరిస్తే బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల గురించి మాట్లాడే తీరిక లేదు.
ఈ సీఎంకు ఢిల్లీ కి ట్రిప్పులు కొట్టడం తప్ప రైతుల తిప్పల గురించి ధ్యాస లేదు. ఈ సీఎం కు ఢిల్లీ కి పంపే ధన సేకరణ ధ్యాసే తప్ప ధాన్యం సేకరణ మీద లేదు.
నిరుద్యోగులను, ఉద్యోగులను ,మహిళలను అందర్నీ మోసం చేసిన కాంగ్రెస్ కు పార్లమెంటు ఎన్నికల్లో బుద్ది చెప్పాల్సిందే.
పార్లమెంటులో బీ ఆర్ ఎస్ ఎంపీ లుంటేనే తెలంగాణ కు భరోసా. తెలంగాణ హక్కుల గురించి ఢిల్లీ లో గళమెత్తేది బీ ఆర్ ఎస్ మాత్రమే.
బీజేపీ పదేళ్లలో తెలంగాణకు ఉద్ధరించింది ఏమీ లేదు. నలుగురు ఎంపీ లు బీజేపీ నుంచి గెలిచినా నయా పైసా పని చేయలేదు.ఢిల్లీ కి వెళ్ళాల్సింది గులాబీ జెండా ..గులాం ల జెండాలు కాదు అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking