Take a fresh look at your lifestyle.

టీయస్ కాస్ట్ – బాసర ఆర్జీయూకేటి మ‌ధ్య ఒప్పందం

0 249

మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మ‌క్షంలో

ఎంఓయూ పై సంత‌కం

హైద‌రాబాద్, మార్చి 9: టీయస్ కాస్ట్ తో – బాసర ఆర్జీయూకేటి అవగాహన ఒప్పందం కుదుర్చుకోవ‌డం వ‌ల్ల విద్య రంగంలో శాస్త్ర, సాంకేతికతను ఉప‌యోగించుకోవ‌డం ద్వారా బోధన, పరిశోధన అవకాశాలను మరింత అన్వేషించడానికి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, శాస్త్ర‌, సాంకేతిక శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. గురువారం అర‌ణ్య భ‌వ‌న్ లో టీయస్ కాస్ట్ (తెలంగాణ స్టేట్ కౌన్సిల్ అఫ్ సైన్స్ & టెక్నాల‌జీ) – బాసర ఆర్జీయూకేటి మ‌ధ్య‌ అవగాహన ఒప్పందం జ‌రిగింది. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఆర్జీయూకేటి వైస్ ఛాన్స‌ల‌ర్ ప్రొఫెస‌ర్ వి. వెంక‌ట ర‌మ‌ణ స‌మ‌క్షంలో ఒప్పంద ప‌త్రంపై టీఎస్ కాస్ట్ మెంబ‌ర్ సెక్ర‌ట‌రీ ఎం.న‌గేష్, ఆర్జీయూకేటి డైరెక్ట‌ర్ పి.స‌తీష్ కుమార్ ఒప్పంద ప‌త్రంపై సంతకాలు చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ… ఈ అవ‌గాహ‌న‌ ఒప్పందం వ‌ల్ల టీయస్ కాస్ట్ – బాసర ఆర్జీయూకేటి రెండూ ఉమ్మడి ఆసక్తి ఉన్న రంగాలైన పరిశోధన, శాస్త్ర‌, సాంకేతిక అభివృద్ధికి, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుందని తెలిపారు. ప్రయోగశాల నుండి సాంకేతికతలను జోడిస్తూ ఉమ్మడి రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లను నిర్వహించడమే కాకుండా సెమినార్లు, సమావేశాలు, వర్క్‌షాప్‌లు నిర్వహించడానికి టీయస్ కాస్ట్ ద్వారా ఆర్జీయూకేటి… యూజీ, పీజీ విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని అశాభావం వ్య‌క్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking