Take a fresh look at your lifestyle.

కల్తీ మద్యం విక్రయిస్తున్న వైన్ షాప్ సీజ్

0 148

కల్తీ మద్యం విక్రయిస్తున్న వైన్ షాప్ సీజ్

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లో కల్తీ మద్యం విక్రయిస్తున్న మద్యం దుకాణాన్ని తొర్రూరు ఎక్సైజ్ అధికారులు బుధవారం సీజ్ చేశారు. ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు ప్రకారం పట్టణంలోని అమ్మాపురం రోడ్ లో ఉన్న శ్రీనివాస్ వైన్స్ లో కల్తీ మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ నిర్వహించారు.

ఈ తనిఖీలో 24 ఐబి క్వార్టర్లు, 11 హాఫ్ బాటిల్లు లభ్యమయ్యాయి. ఎక్సైజ్ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు శ్రీనివాస వైన్స్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. కల్తీ మద్యం విక్రయించిన ఎమ్మార్పీ ధరలను పుల్లగించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలో టాస్క్ ఫోర్స్ అధికారి చిరంజీవి, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking