Take a fresh look at your lifestyle.

తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్‌ ప్రమాణం

0 16

తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్‌ ప్రమాణం
నిర్దేశం, హైదరాబాద్:
ఝార్ఖండ్‌ గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్‌ తెలంగాణ గవర్నర్‌గా ఇవాళ ప్రమాణం చేశారు. రాధాకృష్ణన్‌తో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ ఆరాధే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. ఆయనతోపాటు మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

మొన్నటి వరకు తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై రాజీనామా చేశారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తున్నందున తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి పంపించారు. వెంటనే తమిళిసై రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము… తెలంగాణకు గవర్నర్‌గా సీపీరాధాకృష్ణన్‌ను నియమించారు. ఆయన పుదుచ్చేరికి లెఫ్టనెంట్ గవర్నర్‌గా కూడా వ్యవహరించనున్నారు.తమిళిసై ఇటీవల తెలంగాణ గవర్నర్‌ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రపత్రి ద్రౌపదిముర్ము ఆయనను నూతన ఇంఛార్జి గవర్నర్‌గా నియమించారు

. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్తో రాధాకృష్ణన్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అంశాలు, రాష్ట్ర స్థితిగతులపై నూతన గవర్నర్‌ రాధాకృష్ణన్‌కు సీఎం రేవంత్‌ వివరించారు.కాగా రాధాకృష్ణన్‌ తమిళనాడు బీజేపీలో సీనియర్‌ నేత. గతంలో ఆ రాష్ట్రానికి బీజేపీ చీఫ్‌గా, కేరళ రాష్ట్ర ‍వ్యవహారాల ఇంఛార్జిగా పలు కీలక పదవుల్లో పనిచేశారు. తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2023 ఫిబ్రవరి 18 నుంచి ఆయన ఝార్ఖండ్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ఝార్ఖంగ్‌తోపాటు తెలంగాణ ఇంఛార్జి గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ రెండు చోట్లా పూర్తిస్థాయి గవర్నర్లను నియమించేంత వరకూ సీపీ రాధాకృష్ణన్‌ బాధ్యతలు నిర్వర్తిస్తారని మంగళవారం (మార్చి 20) రాష్ట్రపతి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. కాగా తెలంగాణకు గవర్నర్లుగా పనిచేసిన ECL నరసింహన్‌, తమిళిసై సౌందరరాజన్‌తోపాటు సీపీ రాధాకృష్ణన్‌ ఈ ముగ్గురూ తమిళనాడుకు చెందిన వారే కావడం విశేషం

Leave A Reply

Your email address will not be published.

Breaking