Take a fresh look at your lifestyle.

ఓటర్లకు దేవుడి దర్శనం.. ఆర్మూర్ ఎమ్మెల్యే జిమ్మిక్కులు

0 14

ఓటర్లకు దేవుడి దర్శనం..

  • ఆర్మూర్ ఎమ్మెల్యే జిమ్మిక్కులు

  ఇగో… గీ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మిర్దాపల్లి గ్రామానికి చెందిన అవ్వలు (మహిళలు). గీళ్లంతా బుధవారం టూరిస్ట్ బస్ లో ఆర్మూర్ సిద్దుల గుట్టెక్కి గాడా దేవుళ్లను దర్శనం చేసుకుని యాదగిరిగుట్టకు  పోయిండ్రు. అగో.. గాళ్లు యాదగిరి గుట్టకు పోతే వార్తెనా అనుకుంటుండ్రా…

ఇగో గదే ముచ్చట మీకు చెబుతున్న.. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలుసు గదా.. ఎప్పుడు చూసినా ఏదో వార్తలకెక్కుతుంటాడు.. టీవీలలో కనిపిత్తాడు గదా.. హా.. అతనే గీ టూరిస్ట్ బస్సులో మిర్దాపల్లి అవ్వ (మ  హిళలు) లను ఫ్రీగా తీసుకెళ్లుతుండు. ఇంతకు ముందు కూడా నందిపేట్ మండలం వన్నెల్ (కె), ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామాలకెళ్లి కూడా గిట్లనే టూరిస్ట్ బస్సులో యాదగిరి గుట్ట దర్శనం చేయించిండు.

మొన్న రాఖీ పండుగ నాడు ఆర్మూర్ మండలం అంకాపూర్ లో తనింట్లో ఆర్మూర్ నియోజక వర్గం నుంచి చాలా మంది మహిళలను పిలిపించి చీరలు గిప్ట్ గా ఇచ్చిండ్రు. ఇరువై రోజుల క్రితం మగాళ్లకు చెత్తిర్లు (గొడుగులు) పంచిండు.

అగో… గివన్నీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇప్పుడెందుకు చేస్తుండానే గదా మీ అనుమానం. మొన్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మళ్లా ఆర్మూర్ నియోజక వర్గం నుంచి బీఆర్ఎస్ క్యాండెట్ జీవన్ రెడ్డి పోటీ చేస్తాడని ప్రకటించిండు గదా..

మూడోసారి ఎమ్మెల్యే గా ఎలైనా గెలువాలని ఇగో ఇప్పటి నుంచి ఆర్మూర్ లోనే ఉండి ఓట్ల కోసం గివన్నీ చేస్తుండాని ప్రతిపక్షపోళ్లు ఒర్రుతుండ్రు. గా మధ్య మునుగోడు ఉప ఎన్నికల్లో దండు మల్కాపూర్ ఏరియాకు ఇన్ చార్జీగా ఉన్నపుడు జీవన్ రెడ్డి గక్కడి ఓటరులను యాదగిరి గుట్టకు టూరిస్ట్ బస్సులలో మత్తు మందిని తీసుకెళ్లి స్పెషల్ గా దర్శనం చేయించిండ్రు. ఇగో.. గా దర్శనం చేసుకున్నోళ్లంతా కారు గుర్తుకు ఓటు వేయడంతో  మత్తు మెజార్టీ వచ్చింది. ఆ ఫాలసీని గీడ అమలు చేస్తున్నట్లున్నాడు.

అయినా గిట్లా నేనే జేసిన అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్వయంగా ట్విట్టర్ లో యాదగిరి గుట్టకు పోయేటోళ్ల ఫోటో తీసి పోస్ట్ చేసిండు.

 సునీల్ రెడ్డి కూడా గిట్లనే..

ఇగో.. ఓట్ల కోసం దేవుళ్ల దగ్గరికి తీసుక పోవుడు జీవన్ రెడ్డి కంటే ముందే బాల్కొండ కాంగ్రెస్ క్యాండెట్ గా చెప్పుకుంటున్న సునీల్ రెడ్డి తీసుకు పోయిండు. ఇంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రశాంత్ రెడ్డి మీద ఓడి పోయింతారువాత ఎట్లన్న జేసి గీసారి గెలువాలని స్వంత అరేంజ్ బస్సులలో యాత్రలకు తీసుకెళ్లిండు. గా ఇకుమత్ మంచిగుందని జీవన్ రెడ్డి గూడా తీసుకెళుతుండు. ఎలక్షన్ లు దగ్గరకు వస్తుంటే పోటే చేసేటోళ్లు ఇంకేన్ని వేషాలు వేస్తారో… ?

  • తీస్ మార్కన్ మల్లిగాడు

Leave A Reply

Your email address will not be published.

Breaking