Take a fresh look at your lifestyle.

తీహార్ జైలులో కవిత ఇంట్లో లాగే సదుపాయలు..

0 16

తీహార్ జైలులో కవిత
ఇంట్లో లాగే సదుపాయలు..
నిర్దేశం, న్యూఢిల్లీ : కల్వకుంట్ల కవిత.. ఇప్పుడు తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంది. ఏప్రిల్ 9వ తేది వరకు ఆమె అక్కడే ఉంటుంది. ఆ తరువాత బెయిల్ దొరికితే ఇంటికి వస్తోంది. కవిత రిమాండ్ ను పొడిగిస్తే ఇంకెంత కాలం ఆ జైలులో ఉండాల్సి వస్తుందో ఎవరు చెప్పలేరు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరు నెలలుగా ఆ తీహార్ జైలులోనే ఉన్నారు. ఇప్పుడు కవిత కూడా అతనిపై ఉన్న అవినీతి ఆరోపణల కేసులోనే రిమాండ్ ఖైదీగా ఉంది.
జైలులో కూడా ఇంటి బోజనం
కవిత జైలులో ఉన్నా ఇంటి బోజనం మాత్రం తింటుంది. ఇతర ఖైదిల్లా కాకుండా రౌస్ అవెన్యూ కోర్టు కవితకు కొన్ని సదుపాయలు కల్పించింది. మంచం, పరుపు, బట్టలు, చెప్పులు, దుప్పట్లు, పుస్తకాలను స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు కోర్టు అంగీకరించింది. పెన్ను, పేపర్లు, మెడిసిన్స్ తీసుకెళ్లేందుకు కూడా అనుమతి ఇచ్చింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking