Take a fresh look at your lifestyle.

ప్ర‌జా భ‌వ‌న్‌కు బాంబు బెదిరింపు..

ప్ర‌జా భ‌వ‌న్‌కు బాంబు బెదిరింపు.. అప్ర‌మ‌త్త‌మైన  పోలీసులు

0 97

ప్ర‌జా భ‌వ‌న్‌కు బాంబు బెదిరింపు

అప్ర‌మ‌త్త‌మైన  పోలీసులు

బేగంపేట‌లోని ప్ర‌జా భ‌వ‌న్‌కు బాంబు బెదిరింపు కాల్ వ‌చ్చింది. ప్ర‌జా భ‌వ‌న్‌లో బాంబు ఉందంటూ ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. ప‌ది నిమిషాల్లో బాంబు పేలుతుంద‌ని హెచ్చ‌రించారు. అప్ర‌మ‌త్త‌మైన హైద‌రాబాద్ పోలీసులు ప్ర‌జా భ‌వ‌న్ సిబ్బందికి స‌మాచారం అందించారు.

దీంతో ప్ర‌జా భ‌వ‌న్ వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ప్ర‌జా భ‌వ‌న్‌ను త‌మ ఆధీనంలోకి తీసుకుని, క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నారు. ప్ర‌జా భ‌వ‌న్ ఆవ‌ర‌ణ‌లోనే డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క నివాసం ఉంటున్నారు. ఇటీవ‌ల ఢిల్లీ, ముంబై, కోల్‌క‌తాలోని ప్ర‌ముఖ ప్ర‌దేశాల‌కు బాంబు బెదిరింపు కాల్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ తరహా బాంబు బెదిరింపు కాల్స్ వెనుక ఓ ముఠా హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ వ‌స్తున్న నేప‌థ్యంలో తెలంగాణ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking