Take a fresh look at your lifestyle.

సమాజం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులను ఎల్లవేళల స్మరించుకోవాలి ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు Smd. యూనుస్

0 50

డిశంబర్ 15 న మన భారత స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ సర్ధార్ వల్లభాయ్ పటేల్ గారి వర్థంతి సందర్బంగామరియు డిశంబర్ 15 న అమరజీవి శ్రీ పొట్టిశ్రీరాములు గారి వర్ధంతి సందర్బంగానంద్యాలపట్టణం లో ముస్లిం హక్కుల పోరాట సమితి ఆఫీస మహమ్మద్ యూనుస్ ఆధ్వర్యం లో స్వాతంత్య్ర సమర యోధులు శ్రీ సర్ధార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి మరియు అమర జీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్బంగా వారి ఘణంగా నివాళి అర్పించారు వారిని స్మరించుకున్నారు ఈ సందర్బంగా ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు. Smd. యూనుస్ మాట్లాడుతూ మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని ముస్లిం హక్కుల పోరాట సమితి కార్యకర్త మహమ్మద్ యూనుస్ తెలిపారు పటేల్ గారు 1875 అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించారు.ఈయన ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం
వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు.1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించాడు. రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించాడు.అనేక దేశ సమస్యలను తనదైన పద్దతి తో పరిష్కరించి 1950 డిసెంబరు 15 న మరణించాడు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదాన్ని ఇచ్చి గౌరవించింది.
సాతంత్ర్యసమరయోధుల అడుగుజాడలల్లో నడవాలని రఫి కోరారు.
2)అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16న జన్మించారు. ఈయన విద్యాభ్యాసం అంతా మద్రాసులోనే జరిగింది. బ్రిటీస్ వారి ఆగడాలు చూడలేక స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు.పొట్టి శ్రీరాములు ఉప్పు సత్యాగ్రహంలోపాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో
పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణనిరాహారదీక్ష చేసి,ప్రాణాలర్పించి,అమరజీవియైన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు. ఆంధ్రులకు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు.ఈయన 1952 డిసెంబర్ 15న స్వర్గస్తులైనారు ఈయన ఉద్యమ ఫలితంగా 1953 నవంబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. ప్రజల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులు ఎల్లవేళల స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు.పొట్టి శ్రీరాములు ఇంటిని ఆయన స్మృతి చిహ్నంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కాపాడుతున్నది.ఈ మహనీయుని జ్ఞాపకార్థం రాష్ట్రప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించింది.నెల్లూరు జిల్లా పేరును 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారని తెలిపారు.ఇటువంటి మహనీయులను ఎల్లవేళలా స్మరించుకుంటూ విద్యార్థి దశ నుండే  సేవాభావాన్ని పెంపొందించుకోవాలని. ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు Smd. యూనుస్ కోరారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking