పెంచిన పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గద్దె దించుతామని ఏ ఐ టి యు సి జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు పీ సుంకయ్యఏ ఐ టి యు సి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు పుల్లయ్య అబ్బాస్ ,ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు అన్వర్ లు అన్నారు.సోమవారము స్థానిక పాత బస్టాండ్ నందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అరగంటకు పైగా ధర్నా రాస్తారోకో నిర్వహించడం జరిగింది …ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పి సుంకయ్య మాట్లాడుతూ గత నవంబర్ నుండి 14 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు విచ్చలవిడిగా పెంచి వాహనదారుల అలాగే ఆటో కార్మికుల బ్రతుకులను రోడ్డున పడేశారని వారన్నారు ఇప్పటికే కే నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయి దీనివలన శ్రమజీవులు కార్మికులు పేదలు కొని తినలేని పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు డీజిల్ ధరల తో పాటు మోటార్ వాహన పన్నులు మరియు అధిక ఫైన్ లు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అందుకనే రేపు రైతు బంధు కార్యక్రమంలో ఆటో కార్మికులంతా బంద్ లో పాల్గొంటామని తెలిపారు .ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి.