Take a fresh look at your lifestyle.

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని 5th బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్ నందు క్రిస్మస్ వేడుకలు

0 54

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని 5th బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్ నందు క్రిస్మస్ వేడుకలు. దానికి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ క్రిస్మస్ అని నామకరణం. హిందువులు శతాబ్దాల పోరాట ఫలితం అయోధ్య రామమందిర నిర్మాణం రోజు హిందువులకు కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పనివారు కొందరు ఏకంగా సచివాలయంలో క్రిస్మస్ వేడుకలు జరుపుతున్నారు.ఇదేసమయంలో విజయవాడలో దుర్గమ్మ తల్లి దేవస్థానములో ఆర్జితసేవలు మొదలు ప్రసాదాల వరకు అన్ని రేట్లు పెంచబడినవి. ఆరు నెలలు క్రితం అంతర్వేది రధం తగులబడితే బ్రేకింగ్ న్యూస్ అయినది. ఈరోజున రాష్ట్రంలో చాలా చోట్ల ఆలయాలు, విగ్రహాలూ ధ్వంసం అవుతున్నా అదేదో సర్వసాధారణ విషయం లాగా, నిత్యకృత్యం లాగా ప్రజలు అలవాటు పడేలా కొందరు చేశారు. ఆశ్చర్యం ఏమంటే దాదాపుగా 70 చోట్ల హిందూ దేవాలయాలూ, విగ్రహాలు ధ్వంసం అయినా కూడా ఏ ఒక్కచోటా కూడా నిందితులు దొరకకపోవడం. కానీ APలో పోలీస్, భద్రతావ్యవస్థలు మాత్రం బాగా పనిచేస్తున్నాయి. అంతర్వేదిలో ఓ ప్రార్థనాలయం అద్దం ఒకటి పగిలితే వెంటనే 30మంది అనుమానితులను గుర్తించి వెంటనే కేస్ ఫైల్ చేసి కోర్టుకు పంపగలిగారు.దేశ చరిత్రలో మొదటిసారి ప్రభుత్వమే టెండర్లు పిలిచి ఆగమేఘాల మీద నిధులు విడుదల చేసి గుంటూరు జిల్లా రొంపిచర్లలో చర్చి నిర్మాణం చేసి లౌకికత్వాన్ని చక్కగా కాపాడుకుంటుంది, కానీ కనీసం రోడ్లు మరమ్మత్తులకు కూడా నిధులు లేక నిధుల కోసం తీవ్రంగా అన్వేషిస్తుంది. ప్రైవేట్ టీచర్లు ఉపాధి, ఉద్యోగం లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ముల్లాలకూ, పాస్టర్లకు మాత్రం నెలకు 20 వేల రూపాయల సాయం యుద్ధప్రాతిపదికన అందించి తన మానవత్వం చాటుకుంటుంది.

మిత్రులారా ఈ పరిస్థితికి కారణం ఏమిటో ఆత్మపరిశీలన చేసుకుందాం.
భారత్ మాతాకీ జయ్.సర్వేజనః సుఖినోభవంతు.లోకా సమస్తా సర్మంగళామి భవంతు!

Leave A Reply

Your email address will not be published.

Breaking