Take a fresh look at your lifestyle.

రామబాణం మూవీని ఫ్యామిలీతో వెళ్లి చూడచ్చు

0 13

రామబాణం మూవీని ఫ్యామిలీతో వెళ్లి చూడచ్చు

: సినీ డైరెక్టర్ శ్రీవాస్‌

హైదరాబాద్, మే 2 : ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘రామబాణం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. గోపీచంద్ సరసన డింపుల్ హయతి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు పెంచింది. మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు శ్రీవాస్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

ప్రశ్న: ‘రామబాణం’ ట్రైలర్ చూస్తుంటే మీ స్టయిల్ లో మాస్ స్టైలిష్ యాక్షన్ కనిపిస్తోంది. ఇప్పటి ప్రేక్షకుల ట్రెండ్ కి తగ్గ కొత్త అంశాలు ఇందులో ఎలా వుండబోతున్నాయా?

జవాబు : గోపీచంద్ గారు నేను కలసి మళ్ళీ సినిమా చేయాలని అనుకున్నప్పుడు ఒక మంచి యాక్షన్ సినిమా చేయాలని అనుకున్నాను. అయితే ‘’లక్ష్యం, లౌక్యం ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ క్లాస్ అందరూ లైక్ చేసిన కథలు. మళ్ళీ కలసి చేస్తున్నపుడు మన నుంచి ప్రేక్షకులు అలాంటి సినిమా కోరుకుంటారు” అని గోపీచంద్ గారు నేను భావించాం. ఆయనకి వుండే యాక్షన్, ఎమోషన్స్ అన్నీ చక్కగా కుదిరేలా అదే సమయంలో మంచి ఉద్దేశం వున్న కథ చేయాలని అనుకున్నాం.  అన్నదమ్ముల అనుబంధం మీద ఓ కొత్త పాయింట్ దొరికితే దాన్ని అన్నీ ఎమోషన్స్ ఎలిమెంట్స్ వున్న కథ చేయడం జరిగింది.

ప్రశ్న : ఈ సినిమాకి మొదట లక్ష్యం 2 అనే టైటిల్ ని అనుకున్నారట.. బాలకృష్ణ గారు రామబాణం టైటిల్ ని సూచించారని విన్నాం.?

జవాబు : గోపీచంద్, జగపతి బాబు గారు మళ్ళీ కలసి చేస్తున్నారు కాబట్టి కొన్ని రోజులు లక్ష్యం 2 అని వర్కింగ్ టైటిల్ అనుకున్నాం. అయితే ఆ సినిమా వచ్చి చాలా ఏళ్ళు గడిచింది. మళ్ళీ ఆ కథకు సీక్వెల్ అనుకునే ఛాన్స్ వుంది కాబట్టి ప్రత్యామ్నాయం చూశాం.
ప్రశ్న : ఆర్గానిక్ ఫుడ్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ కదా.. దాని మూలాల్లోకి వెళ్ళారా ?
జవాబు : ఆర్గానిక్ ఫుడ్ పాయింట్ ని కథకు ఎంత అవసరమో అంత వాడాం. ఏ కథ చేయాలన్నా కాన్ ఫ్లిక్ట్ కావాలి. కాన్ ఫ్లిక్ట్ గురించి అలోచించినపుడు.. కరోనా తర్వాత జనాల్లో ఫుడ్ పై అవగాన పెరిగింది. దాని రిలేట్ గా పెడితే ఇంకా కనెక్టింగ్ గా వుంటుందనిపించింది. ఆర్గానిక్ ఫుడ్ పెద్ద సబ్జెక్ట్. ఈ సినిమా కథకు ఎంత కావాలో అంతవరకు చెప్పాం.

ప్రశ్న : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతల గురించి ?

జవాబు : రామబాణం లాంటి సినిమాలు గ్రాండ్ స్కేల్ చేయాలని అనుకున్నపుడు కథని అర్ధం చేసుకొని అన్నీ సమకూర్చే నిర్మాతలు కావాలి. రామబాణం సినిమా ఇంత గ్రాండ్ గా రావడానికి కారణం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు. ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. రామబాణం చూస్తున్నపుడు ప్రేక్షకుల కి ఫుల్ మీల్స్ లా వుంటుంది. ఈ సమ్మర్ కి ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking