Take a fresh look at your lifestyle.

ఔను.. వాళ్లిద్దరూ రాజీపడ్డారు.. శ్రీహరిని గెలిపించే బాధ్యత రాజయ్యదే..

0 13

ఔను.. వాళ్లిద్దరూ రాజీపడ్డారు

శ్రీహరిని గెలిపించే బాధ్యత రాజయ్యదే..

నిర్దేశం, హైదరాబాద్ :

పొలిటికల్… ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేరు. మితృడు శతృవు కావచ్చు.. శతృవు మితృడు కావచ్చు.. ఎన్నికల జోష్ పెరుగుతున్న కొద్ది రోజుకో జెండా మార్చుకునే వినాయకులు ఎందరో… అధికార బీఆర్ ఎస్ పార్టీ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడంతో కొందరికి మింగుడు పడలేదు. టిక్కెట్ ఆశించి భంగ పడిన చాలా మంది మరో పార్టీలోకి వెళ్లడానికి యత్నించడం సర్వసాధారణం.. కానీ.. స్టేషన్ ఘన్‌పూర్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే రెండు పేర్లు కడియం శ్రీహరి, రాజయ్య. ఎప్పటి నుంచో వీళ్లిద్దరి మధ్య రాజకీయం మండుతూనే ఉంటుంది. ఒకరిపై ఒకరు నేరుగానే విమర్శలు చేసుకుంటారు. ప్రత్యక్ష యుద్దంకు సై అంటూ సవాల్ చేసుకుంటారు.

అయితే.. స్టేషన్ ఘన్‌పూర్ ను ఎమ్మెల్యే రాజయ్యను పక్కన పెట్టి మాజీ మంత్రి కడియం శ్రీహరికి ఇచ్చాడు. అయితే.. తనకు టిక్కెట్ ఇవ్వకుండా శ్రీహరికి ఇవ్వడం పట్ల తీవ్ర మనస్థపానికి గురైన రాజయ్య బోరున ఏడ్చాడు. అయినా.. పార్టీ మారే ప్రసక్తి లేదంటునే కాంగ్రెస్ వైపు చూస్తున్నాడనే టాక్ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ను నమ్ముకున్న తాను పార్టీ మారే ప్రసక్తి లేదని ప్రకటించారు రాజయ్య. అంతే… బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రగతి భవన్ కు రాజయ్య, శ్రీహరిలను రాజీకుదిర్చారు. భాయ్ … భాయ్.. అంటూ వాళ్లిద్దరు రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కడియం శ్రీహరిని గెలిపించుకుని వస్తే స్టేట్ లెవల్ లో పదవి ఇస్తామని అధిష్టానం హామి ఇచ్చినట్లు తెలుస్తోంది.

బద్ద శతృవులుగా ఉన్న వాళ్లిద్దరూ..

ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు. థాంక్స్ భాయ్.. అంటూ రాజయ్యకు చెప్పాడు కడియం శ్రీహరి. ఇద్దరు వాలాయ్ బాలాయ్ తీసుకుని సంతోషంగా స్టేషన్ ఘన్‌పూర్ వెళ్లారు. అయితే.. వీరి చర్చల సందర్బంగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజక వర్గ స్థాయి లీడరులతో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. టిక్కెట్ ఆశించి భంగ పడ్డ చాలా మంది లీడర్లు ఎన్నికల తేదీ వచ్చే వరకు నిరిక్షిస్తున్నారు. రాబోయే కాలంలో సర్వేలలో తన పేరు వస్తే మార్పు చేసి తనకు ఇస్తారని, మళ్లీ గవర్నమెంట్ వస్తే ఎమ్మెల్సీ కావచ్చాని నమ్మిన వారి సంఖ్య చాలానే ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking