Take a fresh look at your lifestyle.

తెలంగాణ లో అగని కుక్కల దాడి.

0 294

తెలంగాణ లో అగని కుక్కల దాడి…

అసల్ ఈ కుక్కలకు ఏమైంది..?

ఎంపీపీ భర్తపై వీధి కుక్క దాడి..

సీసీ టీవీలో రికార్డు అయిన దృశ్యాలు

నిర్మల్‌ జిల్లా :  బాసర మండలం బిడ్రేల్లీలో వీధి కుక్క దాడిలో బాసర ఎంపీపీ భర్త విశ్వనాథ్ పటేల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై ఆయన నడుచుకుంటూ వెళుతుండగా.. వెనుక నుంచి వీధి కుక్క వచ్చి దాడి చేసింది.

ఈ దాడిలో విశ్వనాథ్ పటేల్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ‌అయితే కుక్క దాడి చేసిన సీసీ టీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వెనక నుంచి కుక్క రావడాన్ని విశ్వనాథ్ గమనించలేదు. వెనుక నుంచి వచ్చిన కుక్క విశ్వనాథ్ కాళ్లను పట్టుకుంది.

ఈ దాడితో విశ్వనాథ్ కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న మరొక వ్యక్తి తరమడంతో అక్కడ నుంచి కుక్క పారిపోయింది. అతడు తరిమి ఉండకపోతే ప్రాణాలు తీసేదని స్థానికులు చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking