Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ ఉద్యోగులకు జీవో 679 రక్ష..

0 41
ప్రభుత్వ ఉద్యోగులకు అవగహన కల్పించిన ‘‘నిర్దేశం’’
– జీవో ఆదారంగా రివ్యూలు చేస్తున్న ఉన్నతాధికారులు..
– ఈ జీవోతో సర్వీస్ సమస్యలన్నీ పరిష్కారం..
– సీఎంకు డీఎస్పీ ఫిర్యాదుతో వెలుగులోకి 679 జీవో..

 (యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్)

ప్రభుత్వ ఉద్యోగుల భద్రతకు జీవో 679 భరోసా కల్పిస్తోంది. కింది స్థాయి అధికారులను వేదించి, కక్ష సాదింపుతో చర్యలు తీసుకునే అధికారులకు ఈ జీవో కనువిప్పు చేస్తోంది. జీవో 679 / 2008 ప్రకారం తనను అకారణంగా సస్పెండ్ చేసి విచారణ చేయడంలో నిర్లక్ష్యం చేసిన సైబరాబాద్ మాజీ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్రపై చర్యలు తీసుకోవాలని ఏసీపీ మదనం గంగాధర్ ఫిర్యాదుతో ఈ జీవో వెలుగులోకి వచ్చింది. ఆ విషయాన్ని ‘‘నిర్దేశం’’ డైలీ న్యూస్ ప్రత్యేక కథనం రాసింది. ఆ వార్త ఉద్యోగ వర్గాలలో వైరల్ అయ్యింది. ముఖ్యంగా ఉన్నతాధికారులు తమ స్వార్థం కోసం కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేసినా విచారణ సకాలంలో విచారణ చేయాల్సి ఉంటుంది.

ఉద్యోగుల జీవితాలకు భద్రత..

వివిధ ఆరోపణలు ఎదుర్కొన్న కింది స్థాయి ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని భావించిన ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ఉన్నతాధికారుల వ్యక్తిగత కక్షలతో ఉద్యోగులు నష్ట పోతున్నారని వారు పేర్కొన్నారు. సకాలంలో విచారణ చేయక పోవడంతో సర్వీసు సమస్యలు,  ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ ల విషయంలో అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో తేది 01 నవంబర్ 2008 నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీ. రామకాంత్ రెడ్డి జీవో ఎంఎస్ నెంబర్ 679/2008 ను విడుదల చేశారు.య అయితే.. ఇంత కాలం ఈ జీవో గురించి చాలా మంది ఉద్యోగులకు అవగహన లేక నష్ట పోయారు. ‘ప్రభుత్వ ఉద్యోగులకు జీవో 679 భరోసా..’’ అనే శీర్షికతో వచ్చిన వార్త కథనం ఉద్యోగ వర్గాలలో హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియా డామినెట్ చేస్తున్న నేటి కాలంలో వాట్పాప్ లలో వైరల్ అవుతుంది.

ఆ జీవో ఏమి చెబుతుంది..?

ఒకవేళ కింది స్థాయి ఉద్యోగిపై వచ్చిన ఆరోపణలపై నిబంధనల ప్రకారం విచారణ అధికారిని నియమించి త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంటుంది. సాధారణ ఆరోపణలైతే మూడు నెలల్లో.. సీరియస్ ఆరోపణలైతే ఆరు నెలల్లోపు విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని జీవో నెంబర్ 679 పేర్కొంది. ఉద్యోగి తప్పు చేశారని నిరూపణ అయితే కూడా పై అధికారులకు అప్పిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది.  అయితే.. ఉన్నతాధికారి వ్యక్తిగత కక్షలను దృష్టిలో పెట్టుకుని సస్పెండ్ చేస్తే తమకు అన్యాయం చేశారని, జీవో 679 ప్రకారం చర్యలు తీసుకోలేదని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంది.

జీవో 222

విచారణలో నిర్లక్ష్యం చేస్తే..

కింది స్థాయి అధికారులపై వచ్చిన ఆరోపణలపై గడువు లోగా విచారణ చేయనట్లయితే ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ జీవో చెబుతుంది. ఉన్నతాధికారులపై ఫిర్యాదులు చేయడానికి చాలా మంది ఉద్యోగులు భయ పడుతారు. ఉన్నతాధికారలు ఎంత వేదించినా వారిని ఎదిరించలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కోకొల్లాలు. ముఖ్యంగా ఉన్నతాధికారుల వేదింపులతో జీవితంపై విరక్తి పెంచుకుని ఆత్మహత్య చేసుకున్న వారిలో పోలీసు శాఖలోనే ఎక్కువగా కనిపిస్తాయి. జీవో 679 ను అవగహన చేసుకుంటే తమ హక్కుల ప్రకారం ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది.

డీఎస్పీ ఫిర్యాదుతో వెలుగులోకి 679 జీవో..

అన్యాయం చేసిన అప్పటి సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీపెన్ రవీంద్రపై చర్యలు తీసుకోవాలని డీజీపీ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి డీఎస్పీ మదనం గంగాధర్ చేసిన ఫిర్యాదు సంచలనం సృష్టించింది. డిసిప్లేన్ పేరుతో పోలీసు ఉన్నతాధికారులు తమ కింద పని చేసే ఉద్యోగులను అవమానంగా చూస్తుంటారు. అయితే.. నార్సింగ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహించిన తనను అకారణంగా అప్పటి సీపీ స్టీఫెన్ రవీంద్ర  సస్సెండ్ చేసారని డీఎస్పీ గంగాధర్ చేసిన ఫిర్యాదు పోలీసు శాఖలోనే అరుదు అంటున్నారు. తమకు జరిగిన అన్యాయం వల్ల ఏడాదిన్నర కాలం నష్ట పోయానని ఆ ఫిర్యాదులో అతను వివరించారు.

స్టీపెన్ రవీంద్రపై చర్యలు తీసుకుంటుందా..?

కేసీఆర్ ప్రభుత్వంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ గా స్టీపెన్ రవీంద్ర కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపుకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా స్టీఫెన్ రవీంద్రపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే స్టీఫెన్ రవీంద్రపై చర్యలు తీసుకుంటానని పేర్కొన్న రేవంత్ రెడ్డి సీఎం కాగానే అతనిని అప్రధాన్యత గల  హోం గార్డు డిపార్ట్ మెంట్ కు బదిలీ చేశారు.

అయితే.. పోలీసు శాఖలో క్రమశిక్షణ పేరుతో శిక్షించే పోలీసు ఉన్నతాధికారులకు డీఎస్పీ మదనం గంగాధర్  చేసిన ఫిర్యాదు కనువిప్పు కానుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

యాటకర్ల మల్లేష్

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

 

Leave A Reply

Your email address will not be published.

Breaking