Take a fresh look at your lifestyle.

అసెంబ్లీ ఎన్నికలలో ఎన్ని వింతలో..ముప్పై రోజులలో మూడు పార్టీలు మారిన ఆ నేత ఎవరో..?

0 12

అసెంబ్లీ ఎన్నికలలో ఎన్ని వింతలో..ముప్పై రోజులలో మూడు పార్టీలు మారిన ఆ నేత ఎవరో..?
నిర్దేశం, అదిలాబాద్ :
అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నో విచిత్రాలు.. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మారుతున్న రాజకీయ సమీకరణలతో ఎప్పుడు… ఎవరు ఏ పార్టీలో ఉంటారో బ్రహ్మ దేవుడికి కూడా తెలియదెమో..? ఇగో.. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు కూడా ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో తెలియక కార్యకర్తలు తల పట్టుకుంటున్నారు.
బాబురావుకు మూడో పార్టీ కలిసొస్తుందా..?
రాథోడ్ బాబురావు ప్రస్తుతం బోథ్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే.. బీఆర్ ఎస్ టికెటు ఇవ్వడం లేదని భావించిన అతను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానని దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఆ పార్టీ టికెటు ఇవ్వడానికి నిరాకరించింది. అంతే.. క్షణం కూడా ఆలోచన చేయకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలువగా వెంటనే బీజేపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.
సోయం బాపురావ్ ను గెలిపిస్తా..
బోథ్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సోయం బాపురావ్ ను గెలిపించి తీరుతానని శపధం చేశారు రాథోడ్ బాపురావు. సీఎం కేసీఆర్ కు విదేయుడిగా పని చేసిన తనకు కొందరి నిర్వాకం వల్ల తనకు టికెటు ఇవ్వలేదన్నారు ఆయన. క్రమశిక్షణ కలిగిన బిజెపి పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉందని, తనకు అప్పచెప్పిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని , జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని అన్నారు.
మారుతున్న రాజకీయాలలో నేతలు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు కార్యకర్తలు..

Leave A Reply

Your email address will not be published.

Breaking