Take a fresh look at your lifestyle.

ఏ పార్టీలో చేరేది క్లారిటీతోనే ఉన్నా..మాజీ మంత్రి జూపల్లి

0 11

ఏ పార్టీలో చేరేది క్లారిటీతోనే ఉన్నా..

జూన్‌లో నిర్ణయం ప్రకటిస్తా.. : మాజీ మంత్రి జూపల్లి

హైదరాబాద్ మే 19 : బీఆర్‌ఎస్‌ను వీడిన తర్వాత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరాలనే దానిపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొదట బీజేపీలో చేరబోతున్నారని వార్తలు వచ్చినప్పటికీ జూపల్లి మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అలాగే సొంత పార్టీ పెట్టబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. తాజాగా వీటన్నింటిపై మాజీ మంత్రి స్పష్టతనిచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన… ‘‘ఏ పార్టీలో చేరేది క్లారిటీతోనే ఉన్నా.. జూన్‌లో నిర్ణయం ప్రకటిస్తాను’’ అని తేల్చి చెప్పారు. అలాగే తమ వెంట రావడానికి చాలామంది సిధ్ధంగా ఉన్నట్లు జూపల్లి కృష్ణారావు ప్రకటించారు.

కేసీఆర్‌పై ఫైర్…
జూపల్లి ఇంకా మాట్లాడుతూ.. కర్ణాటక ఫలితాలను చూసి సీఎం కేసీఆర్ భయపడ్డారని… అందుకే వెంటనే పార్టీ మీటింగ్ పెట్టారని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కూడా అవే ఫలితాలు వస్తాయన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని పాలించే అర్హత కోల్పోయారని.. ఆయనను ప్రజలు మళ్లీ గెలిపించకూడదని అన్నారు. సీఎం తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలు, దిగజారుడు మాటలు చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్‌కు క్రెడిబిలిటీ లేదన్నారు. అంబేడ్కర్ ప్రతిపక్షాలను లేకుండా చేయాలని చెప్పారా అంటూ నిలదీశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎందుకు కొన్నారని… ఇదేనా మీ నీతి అని అడిగారు. అంబేడ్కర్‌కు కేసీఆర్ ఎన్ని సార్లు పూలమాల వేశారని ప్రశ్నించారు. దళిత బంధుకు ఇప్పుడు చేస్తున్న కేటాయింపులతో దళితులందరికీ ఇవ్వాలంటే 168 ఏళ్లు పడుతుందని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పాలన యంత్రాంగం కుప్పకూలిందన్నారు. ఎవరికి దొరికింది.. వారు దోచుకుంటున్నారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు గుప్పించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking