Take a fresh look at your lifestyle.

అమ్మో… కోవిషీల్డ్ వ్యాక్సిన్..? భయంతో జనం..

0 21

అమ్మో… కోవిషీల్డ్ వ్యాక్సిన్..?

– ఇక ముందు ఆ వ్యాక్సిన్ కనబడదు..

కోవిషీల్డ్ వ్యాక్సిన్..  ఈ పేరు వింటే ప్రజలలో వణుకు పుడుతుంది. కరోనా కాలంలో ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారు ఆనారోగ్యానికి గురై మరణిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే.. ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇకముందు మార్కెట్ లో కనిపించదు.

ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో దానిని తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇక ముందు కనిపించకుండా పోతుంది. ఇప్పటికే వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టు సహా వివిధ దేశాల న్యాయస్థానాల్లో కేసులు వేశారు. దీంతో ఈ వ్యాక్సిన్ అమ్మకాలను కంపెనీ ఉపసంహరించుకుంది.

యూకేకు చెందిన టాప్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా.. ఆక్స్‌ఫర్డ్ సహకారంతో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఇది. కోవిడ్‌ను నిర్మూలించడానికి భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దీన్ని వినియోగించిన విషయం తెలిసిందే. వ్యాక్స్‌జెవ్రియా పేరుతో ఈ వ్యాక్సిన్‌ను ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసింది. పుణేకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ పేరుతో భారత్‌లో పంపిణీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking