ఫ్లాష్ .. ఫ్లాష్.. ఫ్లాష్ …
ఓటు వేయనంటున్న గిరిజనులు
గరిమెళ్ళపాడుకు అధికారుల రాక..
సమస్యల పరిష్కారం కోసం అధికారుల ప్రయత్నం..
సమస్యలు తీర్చకుంటే ఓటు వేయమంటున్న గిరిజనులు..
చుంచుపల్లి మండలం /భద్రాద్రి కొత్తగూడెం.
ఏజెన్సీ జిల్లాలో ఏజెన్సీ మండలంలో ఏజెన్సీ వాసులమైన మమ్మల్ని అధికారులు ప్రతిసారి మోసం చేస్తున్నారు. రాజకీయ నాయకులు అన్యాయం చేస్తున్నారని గరిమెళ్ళ పాడు ఆదివాసి గిరిజనులు ఈసారి ఓటు వేయమంటూ నిరసన బాట పట్టారు. దానికి సంబంధించి గిరిజనుల సమస్యలు తెలుసుకోవడానికి జిల్లా యంత్రాంగం, అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గరిమెళ్ళపాడు ఆదివాసి గ్రామానికి రేపు ఉదయం గురువారం 6 గంటలకు రానున్నారు.
ఇప్పటివరకు ఎన్నోసార్లు గరిమెళ్ళ పాడు ఆదివాసి గిరిజనుల కష్టాలను లోకానికి తెలియజేసిన జర్నలిస్టులందరికీ నమస్కారాలు. కావున ఐదేళ్ల తర్వాత మరోసారి సమస్యల పరిష్కారం కోసం ఓటును బహిష్కరించి నిరసన బాట పట్టిన గిరిజనులకు మద్దతుగా జర్నలిస్టులు తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి.
ఇట్లు.
ఇమంది ఉదయ్ కుమార్
కొత్తగూడెం సామాజిక కార్యకర్త.
ఉషోదయ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు