Take a fresh look at your lifestyle.

రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు

0 11

రైలు ప్రమాదం .. సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు : రైల్వే మంత్రి

ఒడిశా, జూన్ 6 : ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. బార్‌గర్ జిల్లాలో ఓ గూడ్స్ ట్రైన్‌ పట్టాలు తప్పింది. ఐదు బోగీలు ట్రాక్ తప్పి కింద పడిపోయాయి. డుంగురి నుంచి బార్‌గర్‌ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.

అయితే…ఈ ప్రమాదంపై ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పందించింది. ఈ ఘటనతో రైల్వేకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఓ ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన గూడ్స్ ట్రైన్‌ ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే అదుపు తప్పి పడిపోయిందని స్పష్టం చేసింది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోరమండల్ రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసింది.

ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. సీబీఐ సమగ్ర దర్యాప్తుతో ప్రమాదానికి కారణాలు, బాధ్యులెవరో తేలుతుందన్నారు. రైలు ప్రమాదం ఘటనలో ఇప్పటికే 275 మంది ప్రాణాలు కోల్పోగా, 800 మందికి పైగా గాయపడ్డారు. కొందరి డెడ్ బాడీలను గుర్తించి వారి కుటుంబసభ్యులకు అప్పగించగా, 170 నుంచి 180 వరకు డెబ్ బాడీలను గుర్తించలేదని, అవి కుళ్లిపోయే అవకాశం ఉండటంతో గుర్తించడం కష్టమేనని కొందరు అధికారులు భావిస్తున్నారు.

శుక్రవారం జరిగిన ఈ రైలు ప్రమాదం ప్రపంచ దేశాలను సైతం కలచివేసింది. మెయిన్ లైన్ లో వెళ్లాల్సిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు లూప్ లైన్ లోకి వచ్చి గూడ్స్ రైలును ఢీకొట్టడంతో కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. ఆ తరువాత హౌరాకు వెళ్తున్న యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు.. కోరమండల్ బోగీలను ఢీకొట్టడంతో భారీ విషాదంగా మారింది. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్, పాయింట్ మెషీన్‌లో చేసిన మార్పు వల్ల రైలు ప్రమాదం జరిగిందని బాలాసోర్ జిల్లాలో ప్రమాద స్థలంలో మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐ అప్పగించాలని భావిస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking