Take a fresh look at your lifestyle.

హరీష్ రావు ఇదేం పని బాబు.. ఓపిక పట్టు

0 37

హరీష్ రావా.. మజాకా..?

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడిన రెండు రోజులకే…

నిర్దేశం, హైదరాబాద్ :

మాజీ మంత్రి హరీష్ రావును సోషల్ మీడియాలో విద్యావంతులు ఆడుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడి రెండు రోజులు కూడా కాలేదు.. అప్పుడే రైతుల ఖాతాలలో డబ్బులు వేయాలని డిమాండ్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ అండ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంకు టైమ్ ఇవ్వకుండా ఇష్టనుసారంగా మాట్లాడం ఏమిటని ప్రశ్నించారు ఆయన. ఖమ్మం లో మహాలక్ష్మి పథకాన్ని ఉప ముఖ్య మంత్రి భట్టి, మంత్రి తుమ్మల తో కలసి ఆదివారం ఆయన ప్రారంభించారు.

విలువలు లేని హరీష్ రావు తెలంగాణను దోచి మామకి కట్ట పెట్టాడని సంచలన వ్యా ఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే విమర్శలా? అని ప్రశ్నించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి.. తిన్న సొమ్మంతా కక్కిస్తామని హెచ్చరించారు. అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చిన మీరా? మా ప్రభుత్వం గురించి మాట్లాడేది అంటూ హరీష్ రావును ఉద్దేశించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.

రైతు బంధు పైసలు వేయడానికి మూడు నెలల సమయం తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ మా గురించా?మాట్లాడేది అంటూ నిప్పులు చెరిగారు. అప్పుడే ఏముంది ముందుంది ముసళ్ల పండుగ అంటూ వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking