Take a fresh look at your lifestyle.

వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు – భారత్ అబ్బాయి.. పాకిస్థాన్ అమ్మాయి

0 15

వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు
– భారత్ అబ్బాయి.. పాకిస్థాన్ అమ్మాయి

నిర్దేశం, న్యూఢిల్లీ:
ప్రేమ.. ఈ రెండు అక్షరాల ప్రేమకు సరిహద్దులు లేవు. ప్రేమించుకుంటే సప్త సముద్రాలు దాటి కూడా వెళుతారు. ఇగో.. ఈ ప్రేమ కథ అలాంటిదే. భారత్ అబ్బాయి,పాకిస్తాన్ అమ్మాయి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయినా.. కొవిడ్ భూతం వారి ప్రేమకు అడ్డంకిగా మారింది. అయినా.. ప్రేమ కోసం వారు ఐదేళ్లు దూరంగా ఉన్నారు. చివరికి తనకు కాబోయే వాడి కోసం భారత్ లో అడుగుపెట్టింది పాక్ యువతి. బాజా భజంత్రీల మధ్య ఆమెకు ఘన స్వాగతం లభించింది.

ఈ మధ్య కాలంలో ఒక దేశానికి చెందిన పౌరులు, మరో దేశానికి చెందిన పౌరులతో ప్రేమలో పడటం, పెళ్లిళ్లు చేసుకోవడం బాగా పెరిగిపోయింది. సరిహద్దులు దాటుతున్న ఈ ప్రేమలన్నీ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా అలాంటిదే మరోక ప్రేమ కథ సరిహద్దులు దాటి సోషల్ మీడియా చక్కెర్లు కొడుతోంది. తల్లి మొబైల్‌లో యువతి ఫొటో చేసి, ఆమె మరో దేశానికి చెందిన యువతి అని తెలిసి, పంతం నెగ్గించుకుని పెళ్లిపీటలు ఎక్కబోతున్న ఓ యువకుడి ప్రేమ కథపై నెటిజన్‌లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

ఆ ప్రేమ కథ ఎలా చిగురించింది అంటే…?

పశ్చిమ బెంగాల్‌కు చెందిన సమీర్‌ఖాన్‌ అనే యువకుడు జర్మనీలో చదువు పూర్తి చేసుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో 2018లో అతను కుటుంబ సభ్యులను చూసేందుకు భారత్‌కు వచ్చాడు. ఆ సమయంలో అతను తన తల్లి మొబైల్‌ ఫోన్‌లో ఒక యువతి ఫొటోను చూసి ముగ్ధుడై పోయాడు. ఆమె అందానికి దాసోహమయ్యాడు. పెళ్లంటూ చేసుకుంటే ఆమెను చేసుకుంటానని పేరెంట్స్‌పై ఒత్తిడి తెచ్చాడు. కొడుకు కోరిక కాదనలేక సదరు యువతి గురించి అతని పేరెంట్స్‌ ఆరా తీశారు. కొద్దిపాటి ప్రయత్నంతోనే ఆమె పాకిస్థాన్‌లోని కరాచీ నగరానికి చెందిన జవేరియా ఖానుమ్‌ అని గుర్తించారు. ఆ తర్వాత యువతి పేరెంట్స్‌ను కాంటాక్ట్‌లోకి తీసుకుని మాట్లాడారు. ఒకరి గురించిన మరొకరు తెలుసుకున్న తర్వాత ఏకంగా పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నారు. అయితే,వెంటనే పెళ్లి చేసుకోవడంలో వారికి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. సమీర్‌ఖాన్‌ ఉద్యోగరీత్యా జర్మనీకి వెళ్లాల్సి రావడం,ఆ తర్వాత కరోనా విజృంభించడం,అనంతరం జవేరియా ఖానుమ్‌ భారత్‌కు వచ్చేందుకు రెండు సార్లు ప్రయత్నించినా వీసా తిరస్కరణకు గురికావడం లాంటి పరిణామాలతో ఐదేళ్లు గడిచిపోయాయి. అయితే ఈ ఐదేళ్లలో వారు ఒకరినొకరు కలుసుకోక పోయినా మొబైల్‌లో టచ్‌లో ఉన్నారు. వారి మధ్య ప్రేమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా జవేరియా ఖానుమ్‌కు 45 రోజుల గడువుతో భారత్‌ వీసా లభించింది. దాంతో ఆమె భారత్‌కు చేరుకుంది. పాకిస్థాన్‌ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు వచ్చిన జవేరియాను సమీర్‌ఖాన్‌ కోల్‌కతాకు తీసుకొచ్చాడు. సమీర్‌ కుటుంబసభ్యులు ఆమెకు బాజాభజంత్రీలతో స్వాగతం పలికారు. త్వరలోనే ఆ ఇద్దరు ప్రేమికులు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారని సమాచారం. ఆ ప్రేమ జంటకు మనం విష్ యు హెప్పి మ్యారేజ్ చెబుదాం..

Leave A Reply

Your email address will not be published.

Breaking