Take a fresh look at your lifestyle.

కుస్తీ వీరుడు 60 ఏళ్ల వృద్ధుడు..

0 105

కుస్తీ పోటీల వీరుడు ఆరువై ఏళ్ల అబ్బయ్య

మహాశివరాత్రి.. ఆ ఊళ్లో ముసలోళ్లకు అదోక పండుగ. ఆ రోజు వయసు మీద పడిన వృద్దులకు కుస్తీ పోటీ పెట్టి గ్రామస్థులు ఎంజాయ్ చేస్తుంటారు. అయినా.. ఆ ఊళ్లో ఆరు దశాబ్దాలు గడిచిన అబ్బయ్య కుస్తీ పోటీల వీరుడు. అతని కంటే చిన్న వయసు వాళ్లు కూడా అతనిని ఓడించలేరు. ఔను.. అతనితో పోటీ పడాలంటే భయమే.. ఇంతకు ఈ కుస్తీ పోటీలు ఎక్కడో చెప్పలేదు కదా.. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠానా కాలన్ లో జరిగినవి.

ఆరు పదుల వయసు ఉన్న ఓ వృద్ధుడు కుస్తీపోటీల్లో తలపడి సత్తాచా టారు. మహాశివరాత్రి సందర్భంగా  ఎడపల్లి. మండలం ఠానా కాలన్ లో ఆదివారం మల్లయుద్ధం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇద్దరు వృద్ధుల మధ్య కొనసాగిన పోటీ ఉత్కంఠ భరితంగా సాగింది.

గ్రామానికి చెందిన అబ్బయ్య (60). మంగళడు చెందిన హన్మాండ్లు(50) తలపడ్డారు. చివరికి అబ్బయ్య గెలుపొందారు. సర్పంచి భాస్కర్రెడ్డి విజేతకు నగదు బహుమతి అందజేశారు.

 

సేకరణ : రాజేష్, నిజామాబాద్

Leave A Reply

Your email address will not be published.

Breaking