Take a fresh look at your lifestyle.

అదనపు వనరుల కోసం వాణిజ్య పన్ను అధికారులతో సమీక్ష

0 11

వాణిజ్య పన్నుల శాఖ అధికారులను పని తీరు భేష్

: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి

హైద్రాబాద్, మే 11:: 2022-23 సంవత్సరానికి గాను అసాధారణ పనితీరు కనబర్చినందుకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అభినందించారు. ఎగవేత పై దృష్టి సారించడం ద్వారా ఈ ఏడాది 85,000 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించేందుకు తమ ప్రయత్నాలను విస్తరించాలని ఆమె అధికారులను కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వాణిజ్య పన్నుల శాఖలోని సీనియర్ అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించి, అదనపు వనరులను పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలు పై చర్చించారు.

ఆదాయాన్ని పెంచేందుకు వినూత్న సూచనలతో ముందుకు వచ్చిన శాఖ ఉన్నతాధికారులను ఆమె అభినందించారు. పన్ను ఆదాయాన్ని పెంచడానికి సామర్థ్యాలను పెంపొందించుకోవాలని ఆమె అధికారులను కోరారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచడంతోపాటు ఎగవేతలను తగ్గించేందుకు కృషి చేయాలని అన్నారు. అపిలేట్ జాయింట్ కమీషనర్ల వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రతి పదిహేను రోజులకోసారి సమీక్షించాలని ఆమె కమిషనర్‌ను ఆదేశించారు.

ఆదాయం ఎక్కవగా సమకూరే ప్రాంతాలను మ్యాప్ చేసి, క్రమపద్ధతిలో ముందుకు సాగాలని ఆమె అధికారులను ఆదేశించారు.ఆదాయాన్ని పెంపొందించేందుకు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పలు సూచనలు చేశారు. ఎన్‌ఫోర్స్ మెంట్ వింగ్‌ను బలోపేతం చేయడం మరియు స్వచ్ఛంద సమ్మతిని ప్రోత్సహించడం వంటివి ఇందులో ఉన్నాయి. ఈ సమావేశంలో కమర్షియల్‌ ట్యాక్స్‌ కమిషనర్‌ నీతూకుమారి ప్రసాద్‌, అదనపు కమిషనర్లు సాయికిషోర్‌, హరిత, జాయింట్‌ కమిషనర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking