Take a fresh look at your lifestyle.

వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫార్ములా ఈ రేసు సక్సెస్

0 97

వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫార్ములా పోటీలకు హైదరాబాద్ వేదికగా మారింది. వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫార్ములా ఈ రేసులో భాగంగా సాగరతీరాన నిర్వహించిన రేసును చూడటానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. క్రీఢకారులు.. సినీ హీరోలు ఈ రేసును స్వయంగా తిలకించడానికి రావడం విశేషం. 

వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫార్ములా ఈ రేసులో భాగంగా సాగరతీరాన నిర్వహించిన రేసు విజయవంతంగా ముగిసింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ రేసులో ఎలక్ట్రిక్‌ కార్లు ఒకదానికి మించి మరొకటి పోటీపడ్డాయి.

గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసుర్లు దూసుకెళ్లాయి. 11 టీమ్‌లు 22 మంది డ్రైవర్లు ఈ రేసులో పాల్గొన్నారు. ఈ రేసులో జీన్‌ ఎరిక్‌ విన్నర్‌గా నిలిచారు. రెండో స్థానంలో నిక్‌ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్‌ బ్యూమీ నిలిచారు.

ఈ సందర్భంగా విన్నర్‌కు మంత్రి కేటీఆర్ బహుమతి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అసౌకర్యానికి మన్నించాలని హైదరాబాద్‌ నగరవాసులను విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking