Take a fresh look at your lifestyle.

వైఎస్ విజయమ్మకు అగ్ని పరీక్ష

0 19

వైఎస్ విజయమ్మకు అగ్ని పరీక్ష
– ఈ ఎన్నికల్లో విజయమ్మ మద్దతు ఎవరికో..?
– నాడు షర్మిల మద్దతుతోనే జగన్ సీఎం..
– జగన్ ను ఓడించడానికి అందరూ ఐక్యం
నిర్దేశం, కడప :
ఎన్నికలలో ఎన్నో విచిత్రాలు జరుగుతుంటాయి. .. కానీ.. వైఎస్ విజయమ్మకు వింత పరీక్ష ఎదురైతుంది. నీ రెండు కళ్లలో ఏది నీకు ఇష్టం అంటే ఏమి చెబుతుంది…? రెండు కళ్లు ముఖ్యమంటుంది.. ఇగో… వైఎస్ విజయమ్మ మాత్రం ఏమి చెప్పలేక పోతుంది. రెండు కళ్లులాంటి తన ఇద్దరు సంతానం గురించి నోరు విప్పలేక పోతుంది.

విజయమ్మ మద్దతు ఎవరికో..?

ఒకవైపు కన్న కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మరో వైపు కున్న కూతురు వైఎస్ షర్మిలా ఇద్దరూ పొలిటికల్ ప్రత్యార్థులుగా మారారు. ఔను.. రాజకీయాలంటే అలాగే ఉంటాయి. అయితే.. రెండు కళ్లులా భావించే వైఎస్ జగన్.. వైఎస్ షర్మిలకు ఇద్దరిలో వైఎస్ విజయమ్మ ఎవరికి మద్దతు ఇస్తుంది అనేది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్ చర్చ.

నాడు షర్మిల మద్దతుతోనే జగన్ సీఎం..

ఇటీవల వైఎస్ జగన్ తల్లి విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికలలో అన్న – చెల్లెలు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఇద్దరూ ఒక్కటై ఎన్నికల ప్రచారం చేశారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. వైఎస్ జగన్ సీఎం కాగానే తన రక్తం పంచుకుని పుట్టిన సోదరి వైఎస్ షర్మిలను దూరం చేశారు. కొంత కాలం ఆమె తెలంగాణలో పొలిటికల్ గా బలపడాలని యత్నించింది. చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి అన్న జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తోంది.

అందరి టార్గెట్ జగన్..?

ఈ ఎన్నికలలో జగన్ క్లిష్టపరిస్థితి ఎదుర్కొంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన అన్నీ పార్టీల టార్గెట్ వైఎస్ జగన్.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో జగన్ ను ఓడించడానికి అందరూ అతనిపై విమర్శలు చేస్తున్నారు.
వృద్దాప్యంలో ప్రశాంతంగా ఉండాల్సిన వైఎస్ విజయమ్మ ఇద్దరిలో ఎవరికి మద్దతు ఇవ్వలేక మానసికంగా బాధ పడుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking