Take a fresh look at your lifestyle.

తెలంగాణకు ఈసారి కూడా గుండు సున్నానే

చిత్రంగా ఈసారి బీజేపీకి రాష్ట్రం 8 మంది ఎంపీలను ఇచ్చింది. అయినా కూడా రాష్ట్రానికి గుండా సున్నా పెట్టారు. కేంద్రం నుంచి వచ్చే వాటా తప్పితే.. బడ్జెట్ లో కొత్త ప్రకటనలు ఏవీ లేవు.

0 130

– కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి దక్కని ప్రాధాన్యం
– కేంద్రం పన్నుల్లో వాటా తప్ప వేరే కేటాయింపులు లేవు
– 8 మంది ఎంపీలు గెలిచినా, వారు సాధించింది సున్నా
– బడ్జెట్ అంతా బిహార్, ఆంధ్రా రాష్ట్రాలకే

నిర్దేశం, న్యూఢిల్లీ: ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వరాల మీద వరాలు కురిస్తే.. తెలంగాణ రాష్ట్రానికి మాత్రం చిన్నపాటి చినుకంత ఊరట లభించలేదు. ఎప్పటిలాగే ఈసారి కూడా రాష్ట్రానికి తీరని అన్యాయమే జరిగింది. చిత్రంగా ఈసారి బీజేపీకి రాష్ట్రం 8 మంది ఎంపీలను ఇచ్చింది. అయినా కూడా రాష్ట్రానికి గుండా సున్నా పెట్టారు. కేంద్రం నుంచి వచ్చే వాటా తప్పితే.. బడ్జెట్ లో కొత్త ప్రకటనలు ఏవీ లేవు.

ఈసారి కేంద్ర బడ్జెట్ రూ.47,65,768 కోట్లు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు ఓ సారి పరిశీలిస్తే.. కేంద్ర పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి రూ.25,639 కోట్లు రానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో పన్నుల వాటా కింద తెలంగాణకు రూ.23,400 కోట్లు కేటాయించారు. ఈసారి మరో రూ.2,239 కోట్లను పెంచింది. ఇక కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి రూ.19,760.59 కోట్లు రానున్నాయి. ఇక 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు స్థానిక సంస్థల గ్రాంటు కింద రాష్ట్రానికి మరో రూ.3,200 కోట్లు రానున్నాయి. ఈ మూడు పెద్ద పద్దులు తప్ప రాష్ట్రానికి ఈసారి చెప్పుకోదగ్గ కేటాయింపులు ఏమీలేవు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ ప్లాంట్లకు నిధులు కేటాయించాలని, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద మూడేళ్లకు సంబంధించిన రూ.1800 కోట్లను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అలాగే, హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ పారిశ్రామిక కారిడార్‌కు కూడా అనుమతులు మంజూరు చేయాలని సహా పలు విజ్ఞప్తులు చేసింది. అయితే ఇవేవీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.

Leave A Reply

Your email address will not be published.

Breaking