Take a fresh look at your lifestyle.

నాన్నే స్పూర్తిగా లక్ష్యాన్ని నెరవేర్చిన తానియా

0 1,298

నాన్నే స్ఫూర్తి

…తండ్రి లక్ష్యాన్ని నెరవేర్చిన కూతురు తానియా
… కూతురు కోసం విలాసాలకు దూరం
… మహనీయుల బోధనలతో కూతురుతో లక్ష్యాన్ని నింపిన పోశెట్టీ
… నేటితరం విద్యార్థులకు స్ఫూర్తి తానియా
… తండ్రులకు మార్గదర్శి పోశెట్టీ

లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించింది. గమ్యం చేరడం కోసం కోరికలను అదుపు చేసుకుంది . అందరి పిల్లల్లా కాకుండా భిన్నమైన వాతావరణాన్ని తనకోసం ఏర్పాటు చేసుకుంది. తన కోసం నాన్న పడుతున్న ఆరాటాన్ని ఆకళింపు చేసుకుంది. నిత్యం నాన్న పడుతున్న సంఘర్షణ ఆ అమ్మాయిని మరింత రాటుదేలా చేసింది. ఎంతటి శ్రమకైనా సిద్ధమైంది…! నాన్న కోరికను నెరవేర్చింది తానియా. ప్రతిష్టాత్మకమైన ఐ ఐ టి లో సీటు సాధించింది. నాన్న పోశెట్టి కళ్ళలో ఆనందాన్ని నింపింది. కూతురు చూసి గర్వాంగా తలెత్తుకుని శభాష్ పోశెట్టి అనేలా చేసింది.

నిరంతర శ్రమ విజయాన్ని పాదాక్రాంతం చేస్తుంద`ని నిరూపించిన తానియా నేటితరం విద్యార్థినిలకు స్ఫూర్తిగా నిలిచింది. బిడ్డను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే సంకల్పాన్ని సాకారం చేసుకోవడంలో అనేక త్యాగాలను చేసిన పోశెట్టి అనేకమంది తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలిచి మార్గదర్శి అయ్యాడు. శివాజీ మహరాజ్ ను తీర్చిడడడంలో తల్లి జీజీయబాయ్ ఎంచుకున్న మార్గాన్ని అనుసరించిన పోశెట్టి… మహనీయుల విజయగాధలు, మహాత్ముల స్ఫూర్తినిచే మాటలతో కూతురు తానియాలో బలమైన సంకల్పానికి బీజం వేశాడు.

సినిమాలు, షికార్లు, లగ్జరీ జీవితాన్ని వదులుకున్నాడు. అదే తొవ్వలో కూతురు తానియాను నడిపించాడు. తండ్రి మార్గమే తానియా ఎంచుకుంది. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని అలవోకగా సాధించింది. అమ్మానాన్న ఆశకు జీవంపోసింది. తోటి స్నేహితులకు తొవ్వ చూపింది తానియా…! అందరిలా కాకుండా ఆర్భాటలకు, హంగులకు దూరంగా ఉండి, చిన్న వయసులోనే సంపూర్ణ పరిపక్వత్వ అలవర్చుకుని స్ఫూర్తిగా నిలిచిన నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన తానియా సక్సెస్ ఎలా సాగిందంటే…!!

(సూపర్ లీడ్ .. నర్సింహాచారి)

      

ఔను.. నిజమే.. తానియ నేటి యువతకు ఆధర్శంగా నిలుస్తోంది. చేతిలో సెల్ ఫోన్ ఉంటే సోషల్ మీడియాతో బిజీగా ఉండే నేటి యువతకు ఆమె మార్గదర్శకంగా నిలుస్తోంది. ఇంటర్ నెట్ సెల్ ఫోన్ చేతిలోకి వచ్చాక ప్రపంచం గుప్పిట్లోకి వచ్చింది. కానీ.. ఆ సెల్ ఫోన్ ను అనుకుాలంగా మంచి కోసం ఉపయోగిస్తే జీవితంలో ఎంతో ఆద్బుతాలు సాధించవచ్చాని నిరూపిస్తోంది తానియ. ఇప్పటి వరకు తానియా సాధించిన విజయాలను చూస్తే ‘‘శభ్బాష్ అంటూ తానియాను’’ మెచ్చు కోవాల్సిందే.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన శేరు పోశెట్టి – లక్ష్మి దంపతుల కుమార్తె తానియ. ఆర్థికంగా వెనుక బడిన కుటుంబంలో పుట్టిన ఆమె నిజాంసాగర్ లో గల జవహర్ నవోదయ విద్యాలయంలో 6 నుండి 10 వ తరగతి వరకు చదువుకుంది.

ఎన్నిట్లోనో ప్రావీణ్యం..

కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చాని నిరూపించింది తానియ. విద్యాలయం అంటే చదువే కాదు.. ఇష్టమైన హాబిలను సంతోషంగా నెర వేర్చుకోవచ్చాని నిరూపించింది ఆమె. గురువులు చెప్పిన మాట దాటకుండా ఆరోగ్యానికి ఉపయోగపడే యోగను ప్రాక్టీస్ చేసింది.

యోగ-చిత్రలేఖనం లోనూ ప్రతిభ..

P.E.T నిరూప రాణి గారి శిక్షణతో, నవోదయ సమితి వారు నిర్వహించే యోగ కాంపిటీషన్ 2016. అజ్మీర్, రాజస్థాన్ లో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచింది.ఒక్కో విద్యార్థి ఒక్కో ఆంశంలో ప్రావీణ్యం పొందుతారు. కానీ తానియ మాత్రం ఎన్నో ఆంశాలలో ప్రతిభ కనబరుస్తోంది. చిత్రలేఖనం మరియు కవితల్లో ప్రావీణ్యం చూపి ఉపాధ్యాయుల మన్ననలు పొందింది. ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చే తానియ మంచి కవిత్వం రాస్తోంది.

జాతీయ సమైక్యతలో గోల్డ్ మెడల్

విద్యార్థి దశలోనే పిల్లలకు జాతీయ సమైక్యత పెంపొందించే లక్ష్యంతో నవోదయ సమితి వారు ఎంపికైన విద్యార్థులను 9వ తరగతిలో ఇతర రాష్ట్రాలకు పంపుతుంది. అందులో భాగంగా తానియ ఉత్తర ప్రదేశ్ లో గల మథుర నవోదయలో (2017-1018) 9వ తరగతి చదువుతూ మథుర విద్యాలయ తరుపున 2017 చండీగఢ్ లో నిర్వహించిన జాతీయస్థాయి యోగ పోటీల్లో పాల్గొంది. యోగ, జాతీయ సమైక్యతలో ప్రతిభ కనబరిచినందుకు నవోదయ సమితి లక్నో రీజియన్ వారు బంగారు పతకం మరియు సర్టిఫికేట్ ను అందజేశారు.

ప్రధాని మోదీతో ముఖా ముఖి..

పరీక్షా పే చర్చా: మరిచిపోలేని అనుభూతి మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ రచించిన ‘Exam warrior’ (పరీక్ష యోధులు) పుస్తకంపై రాసిన రివ్యూ కథనానికి గాను ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమానికి తానియ ఎంపిక అయ్యింది. ప్రధాని అధ్యక్షాతన జరిగే పరీక్షా పే చర్చా 2.O లో గౌరవ ప్రధాని తో ముఖా ముఖి సమావేశంలో పాల్గొనడం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతి అంటూ గుర్తు చేసుకుంది తానియ.

దక్షణ ఫౌండేషన్ వారి బంగారు పతకం

పదవ తరగతి చదువుతున్న సమయంలో ఐఐటిల్లో సీట్ సాధించాలనే లక్ష్యాన్ని ఏర్పరుచుకుంది. అందుకుగాను (దక్షణ ఫౌండేషన్ వారు దేశంలో గల నవోదయ విద్యాలయాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహించి వారు ఐఐటీ, నీట్ సాధనకై పూర్తి ఉచితంగా విద్యను అందిస్తుంది.) దక్షణ ఫౌండేషన్ వారు నిర్వహించిన పరీక్షల్లో ఉత్తమ పలితం సాధించింది.  వారి స్కాలర్షిప్ మరియు భారత ప్రభుత్వ ‘విజ్ఞాన్ జ్యోతి’ వారి ప్రోత్సాహకంతో, ఉత్తరప్రదేశ్, లక్నో లో గల జవహార్ నవోదయ విద్యాలయంలో ఇంటర్ పూర్తి చేసి, హిమాచల్ ప్రదేశ్, మండిలో గల ప్రతిష్టత్మక ఐఐటీ కాలేజిలో డేటా సైన్స్ విభాగంలో 2021లో సీట్ సాధించింది తానియ.  దక్షణ ఫౌండేషన్ వారు గత సంవత్సరం డిసెంబర్ 26న పుణెలో జరిగిన కార్యక్రమంలో తానియకు బంగారు పథకాన్ని అందజేశారు.

తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గా

దక్షణ ఫౌండేషన్ వారి స్వచ్ఛంద సేవ విభాగంలో సభ్యురాలుగా చేరిన తానియ, ఫౌండేషన్ వారు నిర్వహించే పరీక్షల విభాగానికి 2022లో తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గా అందించిన సేవలు గుర్తించి, ఫౌండేషన్ ప్రతినిదులు తానియను పబ్లిక్ రిలేషన్ కమిటీ జూనియర్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. ఫౌండేషన్ పెద్దలు తనకు ఇచ్చిన బాధ్యతలతో ఫౌండేషన్ సేవలను వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు అందించేందుకు కృషి చేస్తానని తానియ పేర్కొంది.

సైబర్ సెక్యరిటీ దేశానికి అందించడం లక్ష్యం

హిమాచల్ ప్రదేశ్, ఐఐటీ మండీలో బిటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నారు తానియ. మానవాళిని ఉత్తేజపరిచిన కొత్త టెక్నాలజీలో డిజిటల్ రంగం ఎంతో ముఖ్యమైనది. డిజిటల్ విశ్వాసాన్ని పునరుద్దరించడానికి, నైతిక రూపకల్పన నియమావళిని, ప్రతి ఒక్కరికీ ఆర్థిక ఎదుగుదలను తీసుకురావడానికి సహానుభూతి అత్యంత విలువైనది అని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల గారు హిట్ రిఫ్రెష్ పుస్తకంలో చక్కగా వివరించారు. అందుకు డిజిటల్ రంగంలో పౌరులకు గోప్యత, ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని. ‘భవిష్యత్తులో సైబర్ సెక్యరిటీ విభాగంలో దేశానికి సేవలందించాలన్నది నా ప్రధాన లక్ష్యం’ అని తానియ చెబుతుంది.

కలాం నా ప్రేరణ : తానియ

ఒక సాధారణ కుటుంబంలో జన్మించి అత్యంత ఉన్నత స్థానానికి చేరుకుని, ప్రపంచం గౌరవించే భారతీయ పౌరుడిగా ఎదిగిన అబ్దుల్ కలాం గారు జీవితంలో ప్రతి ఘట్టం నాకు ఎంతో ప్రేరణనిస్తుంది. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ లో భారతీయ విలువల గురించి వారు ఇచ్చిన ఉపన్యాసం నాకెంతో ఇష్టమైన వాటిలో ఒకటి. వారి సాధారణమైన జీవితం నాకు ఆదర్శం అంటుంది తానియ. నాన్న నా బలం..విద్యార్థి జీవితంలో విద్యాలయాల్లో క్రమశిక్షణ, విశ్వ విద్యాలయాల్లో విలువలతో విద్యాభ్యాసం నిన్ను ఉన్నత స్థాయికి చేరుస్తుందని చెబుతూ, అలాగే వివేకానందుల వారి సూక్తులతో నాలో దైర్యాన్నీ, అబ్దుల్ కలాం గారి రచనలతో సృజనాత్మకతను, మంచి పుస్తకాలతో ఉత్సాహన్ని,  చైతన్యాన్ని నింపుతూ నాకు నాన్న దిశ నిర్దేశం చేస్తుంటారు అంటుంది తానియ.

పిల్లలు విజయాల వైపు వెళుతుంటే..
పిల్లలు పుట్టగానే సంతోషం కంటే వారు ఎదుగుతున్న తీరు తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది అంటున్నారు తానియ తండ్రి షేర్ పోశెట్టి. విద్యార్ధి దశలో చెడు వ్యసనాలకు బానిస కాకుండా సక్రమమైన మార్గంలో పిల్లలు వెళ్లితే భవిష్యత్ లో తమ లక్ష్యం నెర వేర్చుకుంటారంటున్నారు ఆయన. అబ్దుక్ కలాం సూక్తిని తన కూతురు తానియకు ఎప్పుడు గుర్తు చేస్తాడు పోశెట్టి.

అబ్దుల్ కలాం సూక్తి..

‘‘నేర్చుకోవడానికి లక్ష్యం కుదిరినప్పుడు సృజనాత్మకత పరిమళిస్తుంది.
సృజనాత్మకత పరిమళించినప్పుడు ఆలోచన ప్రసరిస్తుంది.
ఆలోచన ప్రసరించినప్పుడు జ్ఞానం ప్రకాశిస్తుంది.
జ్ఞానం ప్రకాశించినప్పుడు దేశం పురోగమిస్తుంది.’’

———–

My brave daughter Thaniya received a gold medal from Dakshana foundation at Dakshana Valley, Pune, for getting into IIT Mandi, one of the prestigious Engineering institute of the world. I am proud that she successfully volunteered as Telangana state coordinator for DST 2022 and recently she has been elected as one of the Junior Secretary in Public Relations Committee of DAAN(DakshanA Alumni Network).

Dear Thaniya,
“After climbing a great hill, one only finds that there are many more hills to climb.”

With Love &Grace…
– నాన్న.

– యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking