Take a fresh look at your lifestyle.

ఫ్లోరైడ్ ఉద్యమ నేత అంశాల స్వామి ఇక లేరు

0 85

అంశాల స్వామి… ఈ పేరు ఎప్పుడో విన్నట్లు అనిపిస్తోంది కదూ… ఔను.. వికలాంగుడైన అతను తనలా ఇతరులు ఉండకూడదని ప్రభుత్వంపై పోరాటం చేసిన వీరుడు. దేశానికి స్వాతంత్య్రం సిద్దించే ఏడు దశాబ్దాలు గడిచినా తాము స్వచ్ఛమైన నీరు తాగలేక వికలాంగులుగా జన్మిస్తున్నామని భావించిన అంశాల స్వామి ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే కేసీఆర్ ప్రభుత్వం నల్గొండ జిల్లాలో ప్లోరైడ్ నివారణ పథకం  శ్రీకారం చుట్టడానికి అంశాల స్వామి కీలకమైన వ్యక్తి. కేసీఆర్ తనయుడు కేటీఆర్ స్వయంగా అంశాల స్వామితో కలిసి సంయుక్త బోజనం చేశాడంటే అతని ఉద్యమ స్పూర్తి ఏంటో తెలుసుకోవచ్చు.

అంశాల స్వామి ఇక లేరు

నల్గొండ : ఫ్లోరైడ్ పై సుదీర్ఘ పోరాటం చేసిన అంశాల స్వామి కన్నుమూత.

మర్రిగూడ మండలం శివన్నగూడెం లో రాత్రి తన త్రి వీలర్ పై నుంచి కింద పడ్డా అంశాల స్వామి.

తలకు తీవ్రగాయం కావడంతో మృతి.

గత ముప్పై ఏళ్లుగా నల్గొండ జిల్లా లో మునుగోడు లో ఫ్లోరైడ్ మహమ్మారి పై రాజీలేని పోరాటం చేసిన అంశాల స్వామి.

జలసాధన సమితి లో దుస్సర్ల సత్యనారాయణ తో కలిసి పార్లమెంటు వరకు వెళ్లి ప్రధానులను కలిసిన అంశాల స్వామి.

2011 లో ఉమ్మడి నల్గొండ జిల్లా లో హెచ్ఎంటీవీ అధ్వర్యంలో నిర్వహించిన ఫ్లోరైడ్ విముక్తి పోరాట యాత్రలో భాగస్వామ్యం అయిన

అంశాల స్వామి మృతిపై బీఆర్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ సంతాపం చెబుతూ ట్విట్ చేశారు.  అంచాల స్వామితో కలిసి బోజనం చేసిన ఫోటోను ట్విట్ లో షేర్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking