Take a fresh look at your lifestyle.

శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి వేడుకలు

0 125

శ్రీ కోదండరామాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

తిరుపతి, మార్చి 30 (వైడ్ న్యూస్) తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గురువారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఉదయం మూలవర్లకు అభిషేకం చేశారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు ఊంజల్‌ మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.

సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామివారి మఠం నుండి అర్చకులు నూతన వస్త్రాలను తీసుకొని విమానప్రదక్షిణగా వచ్చి స్వామివారి మూలవర్లకు, ఉత్సవర్లకు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో మోహన్, సూపరింటెండెంట్‌ రమేష్‌ కుమార్, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking