Take a fresh look at your lifestyle.

సీఐ కొంప ముంచిన సోషల్ మీడియా పోస్ట్

0 153

ఫలక్ నుమా ఇన్ స్పెక్టర్ ఆర్. దేవేందర్ సస్పెండ్..?

నిందితుడిపై ప్రేమనే కారణమా..?

సోషల్ మీడియా ఎప్పుడు ఎవరి కొంపలు ముంచుతుందో ఎవరికి తెలియదు. ఎవరైనా ఇష్టం ఉన్న వీడియో లేదా పోస్ట్ పెడితే అది వైరల్ గా మారుతుంది. సీక్రెట్ గా జరిగే పనులు కూడా వీడియో ద్వారా బహిర్గతమై నిజాలను బాస్ కు తెలిసే అవకాశం ఎక్కువ.

ఇగో.. ఇప్పుడు ఫలక్ నుమా ఇన్ స్పెక్టర్ ఆర్. దేవేందర్ పరిస్థితి కూడా అటు ఇటుగా ఇదే. సోషల్ మీడియాలో ఓ నిందితుడు పెట్టిన పోస్ట్ సీఐ కొంప ముంచింది.

హైదరాబాద్ యూత్ కరేజ్ నిర్వాహకుడు అయూబ్ పలు కేసులలో నిందితుడు. ఫోర్జరీ బర్త్ సర్టిఫికెట్ కేసులో అయూబ్ తో పాటు మరో ఇద్దరి పై ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న అయూబ్ ను కష్టపడి సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి పోలీసు ఉన్నతాధికారుల ఆదేశంతోొ ఫలక్ నుమా పోలీసు స్టేషన్ లో అప్పగించారు.

అయితే.. అయూబ్ పాత నేరస్తుడు అవడంతో పాటు శాంతి భద్రతలకు తరచూ భంగం కలిగిస్తుండడంతో పోలీసు ఉన్నతాధికారులు అయూబ్ పట్ల కఠినంగా వ్యవహిరించాలని ఫలక్ నుమా ఇన్ స్పెక్టర్ దేవేందర్ కు సూచించారు. ఈ నెల 2వ తేదీన అయూబ్ ను ఫలక్ నుమా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అదే రోజు 20 వేల రూపాయల వ్యక్తి గత పూచికత్తుపై అయూబ్ బెయిల్ పై వచ్చాడు.

‘‘పోలీసులు నన్ను ఏం చేయలేరు’’ అంటూ పోలీసులను కించపరుస్తూ  సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు నిందితుడు అయూబ్. అంతే పోలీసు బాస్ కు కోపం వచ్చింది.

ఫలక్ నుమా ఇన్ స్పెక్టర్ ఆర్. దేవేందర్ నిర్లక్ష వైఖరిని సీరియస్ గా తీసుకున్న సీపీ ఆనంద్ సస్సెండ్ చేసినట్లు తెలిసింది.

– న్యూస్ ఎజెన్సీ

 

Leave A Reply

Your email address will not be published.

Breaking