Take a fresh look at your lifestyle.

లంచం కోసం ఆశ పడ్డ ఎస్సై.. రెడ్ హ్యండ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

లంచం తీసుకుంటూ దొరికిన ఎస్సై -      మధ్యవర్థిత్వం వహించిన జర్నలిస్ట్ -      ఆ ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు..

0 1,136

లంచం తీసుకుంటూ దొరికిన ఎస్సై

–      మధ్యవర్థిత్వం వహించిన జర్నలిస్ట్

–      ఆ ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు..

 నిర్దేశం, మెదక్:

‘‘ఇందుగలదు అందు లేదని సందేహం వలదు.. ఎందెందు చూసినా అందందు అగుపించును అవినీతి.. ’’ ఇదో నీతి సూత్రం కావచ్చు.. నిజమే.. పోలీసు శాఖలో జాబ్ అంటే అక్రమంగా డబ్బులు సంపాదించడమే.. పోలీస్ స్టేషన్ కు వెళ్లినోళ్లు లంచాలు ఇవ్వకుండా తిరిగి రాని రోజులు.. కానీ.. మారిన పరిస్థితులలో కూడా పోలీసులు లంచాలు తీసుకోవడం తమ జన్మహక్కుగా భావిస్తున్నారు. లంచాలు తీసుకుంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

ఇగో.. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ స్టేషన్ ఎస్సై ఆనంద్ గౌడ్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండ్ గా పట్టుకున్నారు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. అవినీతిపై వార్తలు రాయాల్సిన ఓ జర్నలిస్ట్ మధ్యవర్థిత్వం వహించడం.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ను పోలీసు బలగాలతో వెళ్లి పట్టుకున్నాడు ఎస్సై ఆనంద్ గౌడ్. కానీ.. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ కు చెందిన ‘‘మెట్రో ఈవినింగ్’’ జర్నలిస్ట్ మస్తాన్ మధ్యవర్థిగా టిప్పర్ యాజమానితో ఎస్సై ఆనంద్ గౌడ్ తో మాట్లాడారు. 20 వేలు లంచం ఇస్తే టిప్పర్ ను విడిపిస్తానని ఆ జర్నలిస్ట్ ఒప్పించారు. దీంతో టిప్పర్ యాజమాని ఏసీబీ అధికారులను సంప్రదించారు. సోమవారం 20 వేలు లంచం ఎస్సై తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండ్ గా పట్టుకున్నారు. ఆ తరువాత ఆ జర్నలిస్ట్ మస్తాన్, ఎస్సై ఆనంద్ గౌడ్ లను రిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking