Take a fresh look at your lifestyle.

సికింద్రాబాద్ డెక్కన్ స్పోర్ట్స్ అగ్నిప్రమాదం విషాదకరం : సీపీఐ

0 181

సికింద్రాబాద్ డెక్కన్ స్పోర్ట్స్ అగ్నిప్రమాదం విషాదకరం.
మృతులకుటుంబాలకుప్రభుత్వం 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి.
• నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలకు అనుమతి ఇచ్చిన GHMC అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
: ఈటి నరసింహ, హైదరాబాద్ జిల్లా CPI కార్యదర్శి.

సికింద్రాబాద్ దక్కన్ స్పోర్ట్స్ అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సిపిఐ హైదరాబాద్ బృందం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ET నరసింహ మాట్లాడుతూ సికింద్రాబాద్ ప్రాంతంలో గతంలో కూడా అనేక సంఘటనలు జరిగి చాలామంది విలువైన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా అనేక అక్రమ కట్టడాలు ఉన్నప్పటికీ వాటిని కూల్చివేయడంలో జిహెచ్ఎంసి అధికారులు పూర్తి వైఫల్యం చెందారు.

ప్రజలు నివసించే ప్రాంతంలో కమర్షియల్ బిల్డింగులు, గోడౌన్లు నిర్మించవద్దని చట్టం చెబుతున్నప్పటికీ అక్రమంగా అనేక నిర్మాణాలు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. తక్షణమే వీటిని కూల్చివేయాలి.
ఈ కార్యక్రమంలో సిపిఐ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శిలు ఛాయాదేవి,స్టాలిన్, నెర్లకంటి శ్రీకాంత్, సికింద్రాబాద్ కన్వీనర్ కాంపల్లి శ్రీనివాస్, ఉమర్ఖాన్, ఆటో యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షలు కొమరెల్లి బాబు, సహాయ కార్యదర్శి SK లతీఫ్, గువ్వల మల్లేష్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking