Take a fresh look at your lifestyle.

ఎస్సైపై ఇసుక మాఫియా దాడి

0 50

 సినిమా ఫక్కీలో దాడి చేసి పారిపోయే సీన్
వెంటాడి ఇసుక లారీని పట్టుకున్న ఎస్ఐ

మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధిలోని దుందిబి వాగు నుండి ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతుంది.

ఇసుక మాఫియా స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో రెచ్చిపోతుంటే పట్టించుకోవాల్సిన పోలీస్, రెవిన్యూ, మైనింగ్ శాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవరించడంపై పలు విమర్శలకు తావిస్తోంది.

ఈ నేపథ్యంలోనే బరితెగించిన ఇసుక మాఫియా జడ్చర్ల ఎస్సై వెంకటేష్ పై దాడికి దిగింది. సోమవారం మిడ్జిల్ మండల పరిధిలోని దుందుభి వాగు నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తూ జాతీయ రహదారి 44 నుండి జడ్చర్ల క్లబ్ రోడ్డు మీదుగా జడ్చర్ల పట్టణంలోకి అక్రమంగా ప్రవేశిస్తుండగా విశ్వసనీయ సమాచారం అందుకున్న జడ్చర్ల ఎస్సై వెంకటేష్ ఇసుక వాహనంను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఈ నేపథ్యంలోనే పోలీస్ పెట్రోలింగ్ ద్విచక్ర వాహనంపై వెళ్లిన జడ్చర్ల ఎస్సై వెంకటేష్ ను ఇసుక మాఫియా భారత్ బెంజ్ లారీ తో ఢీ కొట్టింది. దీంతో ఎస్ఐ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం స్వల్పంగా ధ్వంసం కాగా ఎస్సైకు ఎలాంటి గాయాలు కాలేదు.

ఇదిలా ఉంటే ఇసుక మాఫియా వానాన్ని ఆపాలని ఎస్సై అడిగినా వాహనాన్ని ఆపకుండా సినీ ఫకీలు దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం విడ్డురం. దీంతో ఎంతో చాకచక్యంగా ఇసుక మాఫియా లారీని వెంబడించి ఎస్సై వెంకటేష్ పట్టుకోవడంతో చేసేదేమీ లేక ఇసుక మాఫియా ఆగిపోయింది.

ఇసుక మాఫియాను అరికట్టాలి
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఇసుక మాఫీయా ఆగడాలు రోజురోజుకి పెరిగిపోయాయని, ఇసుక మాఫియాను అరికట్టాలని నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. జడ్చర్లలో ఎస్ఐ వెంకటేష్ పై ఇసుక మాఫియా దాడిని ఆయన ఖండిచారు. అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు రెవిన్యూ మైనింగ్ శాఖా అధికారులు ఇసుక మాఫియా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking