Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ పార్టీలో బుజ్జగింపులు

0 19

అసంతృప్తులతో  రేవంత్ టీమ్ చర్చలు

హైదరాబాద్, ఏప్రిల్ 24 :  ఇన్నాళ్లు ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించేందుకే పరిమితమైన టీ కాంగ్రెస్.. ఇకనుంచి చేరికలపైన దృష్టి పెట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ అసంతృప్తులకు గాలం వేయాలని ప్లాన్ చేసుకుంది. కాంగ్రెస్బలోపేతానికి చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సుమారు 60 అసెంబ్లీ సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థులు ఉన్నట్లు ఆ పార్టీ భావిస్తోంది.

మిగతా స్థానాల్లోనూ ఫోకస్పెట్టాలని నిర్ణయించుకుంది. ప్రధానంగా 11 జిల్లాలపై ఫోకస్ చేసింది. ఆయా జిల్లాల్లోని బీఆర్ఎస్పై అసంతృప్తితో ఉన్న ముఖ్య నేతలకు కండువా కప్పేలా వ్యూహ రచనలు చేస్తున్నది.సదరు లీడర్లకు భరోసా ఇచ్చేందుకు నేరుగా రాహుల్గాంధీని ఈ టాస్క్లో ఇన్వాల్వ్చేయనున్నది.

దీంతో నేతల్లో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు పార్టీకి మేలు జరుగుతుందని టీపీసీసీ ఆలోచిస్తున్నది. అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను పోటీలోకి దింపడంతో పాటు .. కనీసం 70 సీట్లు తగ్గకుండా గెలవాలని పార్టీ సీరియస్గా తీసుకున్నది. ప్రజలతో మరింత మమేకమైతే మరో ఐదు నుంచి 10 సీట్లను గెలవచ్చని ఇటీవల కాంగ్రెస్చేయించుకున్న ఇంటర్నల్సర్వేలో తేలినట్లు సమాచారం.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేత అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరికతో టాస్క్ను షురూ చేయాలని టీ కాంగ్రెస్ ఆలోచన చేస్తున్నది. ఇప్పటికే పొంగులేటి, పార్టీ ముఖ్యుల మధ్య చర్చలు జరిగినా.. తుది నిర్ణయంపై ఓ కొలిక్కి రాలేదు. కానీ ఆయన చేరిక అనంతరం ఉమ్మడి ఖమ్మంతో పాటు మహబూబ్నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలోని ముఖ్య నేతలను చేర్చుకోవాలని సంప్రదింపులు చేస్తున్నది.

దీంతో పాటు అధికార పార్టీకి చెందిన మరికొందరు ఎమ్మెల్సీలతోనూ కాంగ్రెస్టచ్లోకి వెళుతున్నది. టిక్కెట్లు ఆఫర్లతో గాలం వేయనున్నది.ఇప్పటికే కాంగ్రెస్కు హ్యాండ్ ఇచ్చి అధికార పార్టీ లోకి వెళ్లి లబ్ధి పొంది, ప్రస్తుతం అసంతృప్తితో ఉన్న నేతలను మాత్రం మళ్లీ చేర్చుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో పార్టీ కేడర్లో విభేదాలు ఏర్పడి, చీలికలు వచ్చే ప్రమాదముందని టీ పీసీసీ ముఖ్య నేతలు భావిస్తున్నారు.

వివిధ నియోజకవర్గాల్లో ప్రజల్లో మంచి పేరు, బలాన్ని సాధించిన నేతలపైనే ప్రధానంగా ఫోకస్పెట్టనున్నారు. బీఆర్ఎస్లో టిక్కెట్లు రావని భావించేటోళ్లను కూడా ముందస్తుగా సంప్రదింపులు చేసి హోల్డ్లో పెట్టేందుకు వ్యూహాలను పన్నుతున్నారు. అన్ని జిల్లాల్లో చేరికల కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే కాంగ్రెస్ చేరికల టాస్క్ఏ విధంగా సక్సెస్ అవుతుందనేది ? కొద్దిరోజుల్లోనే తేలనుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking