ఓటరు కావలెను…
క్వాటర్ సీసాకు లొంగని ఓటరు కావలెను…
చీర జాకెట్టుకు ఓటును తాకట్టు పెట్టని ఓటరు కావలెను…
నోటుకు ఓటును అమ్మని ఓటరు కావలెను…
పని చేసేటోడికే ఓటేసే ఓటరు కావలెను…
ఉచితాలను ఊరవలతకు ఉరికించే ఓటరు కావలెను…
కులపిచ్చి లేని ఓటరు కావలెను…
మత పిచ్చి లేని ఓటరు కావలెను…
మనిషిని మనిషిగా చూసేవాడికి ఓటేసే ఓటరు కావలెను…
మానవత్వం బ్రతికించే నాయకుడిని నడిపించే ఓటరు కావలెను…
వర్గాల మధ్య చిచ్చుపెట్టే పుచ్చు బొచ్చు కుచ్చు నాయకులను ఉచ్చువేసే ఓటరు కావలెను…
సమాజంలోని అందరిని సమానంగా చూస్తూ
సమిష్టి అభివృద్ధిని చేసే ఓటరు కావలెను…
అవినీతి నాయకుడిని అంతం చేసే ఓటరు కావలెను…
అందరి క్షేమం పెంచే వాడికి ఓటేసే ఓటరు కావలెను…
కల్లబొల్లి మాటలకు మోసపోని ఓటరు కావలెను…
కరుడుగట్టిన ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టే ఓటరు కావలెను…
దొంగ నాయకుల దోపిడి పనులను కడిగిపడేసి
తుంగలో తొక్కే ఓటరు కావలెను…
మంచి సేవగుణమున్న నాయకులకు బలమును పెంచే నాయకుడు
భరతమాతను బ్రతికించే ఓటరు కావలెను…
భావితరాలను వెలిగించే ఓటరు కావలెను…
అసలుసిసలైన ఓటరు కోసం
75 ఏళ్ళుగా భరతమాత ఎదురుచూస్తుది
ఆ ఓటరు వచ్చేది ఎప్పుడో
భారతదేశం పరిపూర్ణంగా గెలిచేది ఎప్పుడో…
వీధి వీధిన పేరుకుపోయిన సమస్య పుట్ట చచ్చేదెప్పుడో…
అభిరామ్ 9704153642
★★★★★★★★★★★★
మీకు పుట్టినరోజు మరియు పెళ్ళిరోజు…లేదా సందర్భం ఏదైనా కవిత లేదా వ్యాసం, పాట వ్యక్తిగతంగా కావాలంటే కింది నా నెంబర్ను సంప్రదించగలరు…
అభిరామ్ 9704153642