Take a fresh look at your lifestyle.

ఓయూకు పూర్వ విద్యార్థి రికార్డు స్థాయి విరాళం

0 16

ఓయూకు పూర్వ విద్యార్థి రికార్డు స్థాయి విరాళం

నిర్దేశం, హైదరాబాద్ :

“ఓయూకు పూర్వ విద్యార్థి రికార్డు స్థాయి విరాళం”.
ఓయూ పూర్వ విద్యార్థి గోపాల్ టి.కె. కృష్ణ ఐదు కోట్ల భారీ విరాళం ప్రకటించి రికార్టు సృష్టించారు. తాను చదువుకున్న విద్యాసంస్థ అభివృద్ధిలో భాగస్వామ్యమవుతూ….. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఆధునిక తరగతి గదుల సమూహ నిర్మాణానికి ఐదుకోట్ల రూపాయల విరాళాన్ని అందిస్తానని ప్రకటించారు.

టి.కె.ఎస్ ఆచార్య, టి.కె రాజమ్మాళ్ కుమారుడైన గోపాల్ టి.కె కృష్ణ హైదరాబాద్ మథడిస్ట్ బాయ్స్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో 1963లో ప్రాథమిక, సెకండరీ విద్య పూర్తి చేశారు. ఓయూ ఇంజినీరింగ్ కళాశాల నుంచి 1968 లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో పట్టభద్రుడయ్యాడు. అంచలంచెలుగా ఎదిగిన ఆయన… 106ఏళ్ల ఉస్మానియా చరిత్రలో వ్యక్తిగతంగా 5కోట్ల భారీ విరాళాన్నిప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. విద్య పట్ల తనుకున్న అంకిత భావాన్ని చూపి చారిత్రక మైలురాయిని నెలకొల్పారు. ఈ సందర్భంగా సెమినార్ హాల్‌కు ప్రొఫెసర్ V.M. గాడ్గిల్ ఆడిటోరియంగా పేరు పెట్టాలని గోపాల్ టి.కె కృష్ణ విజ్ఞప్తి చేశారు. విద్యార్థిగా తమను ఉన్నతంగా తీర్చిదిద్దన నాటి అధ్యాపకుల పేరుతో కమిటీ హాల్ కు ప్రొఫెసర్ అబిద్ అలీ పేరును ఆయన సూచించారు. తన కలలను సాకారం చేయటంలో ఎలక్ట్రికల్ విభాగం నిర్ణయాత్మకమైన పాత్ర పోషించిందని గుర్తు చేశారు. తెలంగాణ ఎడ్యుకేషన్ & వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అంచనా ప్రకారం ప్రాజెక్ట్ వ్యయం రూ. 9.95 కోట్లు ఇందులో సింహభాగం కృష్ణ గారే ఇవ్వటం ఆనందంగా ఉందని…. ఉపకులపతి ప్రొఫెసర్ డి.రవీందర్ అన్నారు. ఉస్మానియా ఫౌండేషన్ ద్వారా ఓయూకు భారీగా విరాళాలు, విజ్ఞాన సహకారం అందుతోందని అన్నారు. వ్యక్తిగత హోదాలో టి.కె కృష్ణ రికార్డు సృష్టించారని గుర్తు చేశారు.

యూనివర్శిటీలో మౌళిక వసతుల అభివృద్ధికోసం ముందుకు వచ్చిన పూర్వ విద్యార్థి సహకారానికి… యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి. చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. టి.కె. కృష్ణ స్పూర్తితో పూర్వ విద్యార్థులు తాము చదివిన విద్యాసంస్థ ప్రగతి కోసం సంపూర్ణ సహకారం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
భారీ విరాళం ఇవ్వటం ద్వారా గోపాల్ టి.కె కృష్ణ ఉస్మానియా విశ్వవిద్యాలయ చరిత్రలో శాశ్వత అధ్యాయాన్ని లిఖించుకున్నారని ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ అభినందించారు.
ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.పి.లక్ష్మీనారాయణ, OSD ప్రొఫెసర్ B. రెడ్యా నాయక్, ఇంజినీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు విజయ్ కుమార్… కృష్ణ సహకారాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking