Take a fresh look at your lifestyle.

ప్రధాని మోదీ బ్రాండ్ కు కాలం చెల్లింది : కాంగ్రెస్

0 11

ప్రధాని మోదీ బ్రాండ్ కు కాలం చెల్లింది
:టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

హైదరాబాద్, మే 18 : కర్ణాటక ఫలితాలపై దేశ నలుమూలల చర్చ జరుగుతోంది. మోదీ బ్రాండ్ కు కాలం చెల్లిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం గాంధీ భవన్ లో అయన మీడియాతో మాట్లాడారు. ఈడీ, సీబీఐ తో ఎన్నికల్లో నెగ్గాలని భావించిన మోదీని కర్ణాటక ప్రజలు ఓడించారు. మోదీతో సహా కేంద్ర మంత్రులంతా కర్ణాటకలో మోహరించారు. జై భజరంగబలి, ముస్లిం రిజర్వేషన్లు, కులాల విభజన తెచ్చి కుట్ర పూరితంగా గెలవాలని ఒత్తిడి తెచ్చారు. మోదీ కుట్రలను తిప్పికొట్టి కర్ణాటకలో కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించారు.

ఈ గొప్ప తీర్పును బుద్ది జీవులు స్వాగతించారు. ప్రజాస్వామ్యం బతకాలని మోదీని ఓడించేందుకు అందరూ కలిసి వచ్చారు. ఈ అద్భుతమైన తీర్పును ప్రపంచం అభినందిస్తుంటే కేసీఆర్ మాత్రం గెలుపు గురించి ఆలోచించాల్సిన పనిలేదని మాట్లాడారు. మోదీని ఓడిస్తానని కేసీఆర్ పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కర్ణాటకలో హంగ్ తీసుకురావాలని కేసీఆర్ చేసిన కుట్రలను మేం బయటపెట్టాం. కేసీఆర్ కర్ణాటక ప్రజల తీర్పును అభినందిస్తారని అనుకున్నామని అన్నారు.

కాంగ్రెస్ నాకు బద్ధ వ్యతిరేకులు కూడా కర్ణాటక ప్రజల తీర్పును అభినందించారు. కర్ణాటక ఫలితాలు తెలంగాణపై ఉండవని బండి సంజయ్ చెప్పిన మాటలనే కేసీర్ చెప్పారు. కర్ణాటకలో మోదీ ఓటమిని అంగీకరించేందుకు కూడా కేసీఆర్ కు మనసు ఒప్పడం లేదు. మోదీని ఓడించేందుకు కాంగ్రెస్ అవసరం ఉందని అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. కానీ నిన్న కేసీఆర్ మాట్లాడిన మాటలు మోదీ నాయకత్వాన్ని సమర్ధించేలా ఉన్నాయి. కర్ణాటకలో బీజేపీ చేసిందే తెలంగాణలో కేసీఆర్ చేస్తున్నారు. బీజేపీ, బీఆరెస్ ఒకే తాను ముక్కలు. మోదీ, కేసీఆర్ వేర్వేరు కాదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే విడిపోయినట్లు నతకమాడుతున్నారు. కర్ణాటకలో హంగ్ తీసుకొచ్చి కేసీఆర్ చక్రం తిప్పాలనుకున్నారు. కానీ కర్ణాటక ప్రజలు కేసీఆర్ నడుములు విరిగే తీర్పు ఇచ్చారు. కర్ణాటక ప్రజల తీర్పు దేశానికి దశ, దిశ నిర్ణయించే తీర్పు. తెలంగాణ ప్రజల పక్షాన కర్ణాటక ప్రజల తీర్పును అభినందిస్తున్నాం.

కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం బిచ్చమెతుకుని బతకాల్సి వచ్చేది. అన్ని రకాల త్యాగాలు చేసి ప్రజల కోసం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. మిగులు బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పాటు చేయడం ద్రోహమా? కేసీఆర్ కు సీట్లు ఇవ్వడం, కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వడం ద్రోహమా? కేసీఆర్ ను నమ్మినందుకు కాంగ్రెస్ ను ద్రోహులు అంటున్నారా? బీసీ జనాభా లెక్కించాలని కాంగ్రెస్ స్పష్టమైన విధానం తీసుకుంది. బీసీ జనాభా లెక్కించడాన్ని ఎవరు అడ్డుకుంటున్నారో మోదీ చెప్పాలి. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి.

పదవి పోయే ముందు బీసీలు గుర్తొచ్చారా? పార్లమెంటులో బీసీ జనగణకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. రాష్ట్రంలో వివేక్, ఈటల, రాజగోపాల్ రెడ్డి, విష్వఈశ్వర్ రెడ్డి, కేసీఆర్ ను ఓడించేందుకు బీజేపీ తో కలిశారు. కానీ బీజేపీ వారిని నమ్మదు, వారు బీజేపీని నమ్మరు. కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరగాలి. ఇందుకోసం అందరినీ కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్న . పార్టీ కోసం, తెలంగాణ ప్రజల కోసం పది మెట్లు దిగడానికైనా సిద్ధం. కాంగ్రెస్ పార్టీ అమ్మలాంటిది. కేసీఆర్ ను ఓడించడం బీజేపీతో కాదు.. బీజేపీ, కేసీఆర్ వేరు కాదు. తెలంగాణ అభ్యున్నతికి పని చేయలనుకునేవారు కాంగ్రెస్ తో కలిసి రండని రేవంత్ పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking