Take a fresh look at your lifestyle.

క్యూ ఆర్ కోడ్ తో రైలు టిక్కెట్

0 9

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

క్యూ ఆర్ కోడ్ తో రైలు టిక్కెట్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్‌. దక్షిణ మధ్య రైల్వే.. ప్రయాణికులకు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై క్యూ ఆర్ కోడ్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ సేవల ద్వారా కౌంటర్ల వద్ద రద్దీ తగ్గింది. సాధారణ రైల్వే టికెట్‌లను క్యూఆర్‌ కోడ్‌ ద్వారా బుక్‌ చేసుకొనే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఫస్ట్ ఫేజ్‌లో సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోని 14 స్టేషన్లలో ఉన్న 31 కౌంటర్లలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.రైల్వేశాఖ డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ సేవలను ప్రారంభించింది. జనరల్ బుకింగ్ కౌంటర్లలో ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి నిమిషాల్లో వ్యవధిలోనే ట్రైన్ టికెట్ పొందవచ్చు.

ఈ విధానం ద్వారా చిల్లర సమస్య కూడా ఉండదు. తొలి దశలో భాగంగా.. సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట , వరంగల్ , బేగంపేట మంచిర్యాల, లింగంపల్లి, హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, మహబూబాబాద్, బెల్లంపల్లి, ఫతేనగర్ బ్రిడ్జ్, సిర్పూర్ కాగజ్ నగర్, వికారాబాద్ రైల్వే స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే యూ.టి.ఎస్. (జనరల్ బుకింగ్) కౌంటర్లలో మాత్రమే క్యూఆర్ కోడ్ సదుపాయంతో అన్‌రిజర్వ్ టిక్కెట్లు కొనుగోలు చేసుకునే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే

Leave A Reply

Your email address will not be published.

Breaking