Take a fresh look at your lifestyle.

లైంగిక బాధితులకు ఆర్ధిక సహాయం

0 76

లైంగిక వేదింపుల కేసులో బాధితులకు

పోలీస్ శాఖ అధ్వర్యంలో తక్షణ ఆర్ధిక సహాయం
: జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి

జిల్లా పోలీస్ కార్యాలయం నందు నేడు లైంగిక వేదింపులు ద్వారా మోసపోయిన 10 మంది బాధితులకు పోలీస్ శాఖ అధ్వర్యంలో తక్షణ ఆర్ధిక సహాయం అందజేయడం జరిగిందని జిల్లా యస్.పి  అన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ లైంగిక వేదింపుల కేసుల్లో నల్లగొండ రూరల్ పి.యస్ పరిధిలో 11 సం” బాలిక, నల్లగొండ 1 టౌన్ పరిధిలో 30 సం మహిళా,తిరుమల గిరి పి.యస్ పరిధిలో 14 సం ” బాలిక మరియు 23 సం” మహిళా,నకిరేకల్ పి.యస్.పరిధిలో 16 సం”బాలిక

చిట్యాల పి.యస్ పరిధిలో 17సం” బాలిక, మరియు 26సం” మహిళా,కనగల్ పి.యస్ పరిధిలో 27 సం” మహిళా మిర్యాలగూడ పి.యస్.పరిధిలో 6 సం” బాలుడు, పెద్దవూర పి.యస్
పరిధిలో 11 సం” బాలిక బాధితులుగా ఉన్న మహిళలకు ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది.ఈ బాలలకు, మహిళలకు భరోసా సెంటర్ ద్వారా ప్రభుత్వ సేవలు, పోలీసు సేవలు అందిస్తున్నట్లు, న్యాయపరమైన, వైద్యపరమైన, నైతిక పరమైన, సాంకేతిక పరమైన, సామాజికపరమైన భద్రత, సహాయ, సహకారాలను భరోసా సెంటర్ ద్వారా బాధితులకు అందించడం జరుగుతుందని అన్నారు.

పోలీసు భరోసా సెంటర్ మరియు షీ టీమ్స్ ద్వారా ప్రజలకు, మహిళలకు, విద్యార్థులకు, బాధితులకు అందించవలసిన సేవల గురించి వివరించి, లైంగిక వేదింపుల కేసుల్లో బాధితులు ఉన్న 10 మందికి పోలీస్ శాఖ అధ్వర్యంలో తక్షణ ఆర్ధిక సహాయాన్ని భరోసా కేంద్రం నుండి అందించడం జరిగిందని, ప్రభుత్వం ద్వారా అందవలసిన ఆర్ధిక సహాయాన్ని అందించడంలో పోలీస్ శాఖ అన్ని విధాలుగా కృషి చేస్తుంది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె.ఆర్.కె ప్రసాద్ రావు షి టీమ్ ఇంచార్గ్ సి. ఐ రాజశేఖర్ గౌడ్, ఉమెన్ ఏ.యస్. ఐ ఆబెదా బరోసా సెంటర్ కోఆర్డినేటర్ నళిని పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking