Take a fresh look at your lifestyle.

కొందరు ఐఏఎస్ అధికారుల్లో దడ!

0 44

తెలంగాణలోని కొందరు ఐఏఎస్ అధికారుల్లో దడ!

హైదరాబాద్ : తెలంగాణలోని కొందరు ఐఏఎస్ అధికారుల్లో దడ మొదలైంది. కొందరు అవినీతికి పాల్పడిన వారు తమ భవిష్యత్ ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.

ఇటీవల ఇలాంటి వారి లిస్టును తయారు చేసిన తెలంగాణ బీజేపీ వాటితో ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నలుగురు ఐఏఎస్ లపై గురిపెట్టినట్లు సమాచారం. ఇందులో ఒకరు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారు ఉండడం గమనార్హం.

గత కొన్నేళ్లుగా భూ అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వానికి చెందిన కొందరు పెద్దలకు అప్పనంగా కట్టబెట్టారని అందుకే వారి విషయాన్ని కేంద్రానికి చెప్పేందుకు వారు చేసిన అక్రమాల జాబితాతో ఢిల్లీ వెళ్లినట్లు బీజేపీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

అయితే ఐఏఎస్ ల అక్రమాలు బీజేపీ నేతలకు ఎలా చేరినట్లు? వారికి ఆ వివరాలు ఎవరిచ్చారు? అనేది హాట్ టాపిక్ గా మారింది.తెలంగాణలో కొంతమంది ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్ కు సన్నిహితంగా ఉంటూ ధరణిలో అక్రమాలకు పాల్పడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ప్రజల బాగోగులు పట్టించుకోకుండా కేసీఆర్ కుటుంబ సభ్యులకు సన్నిహితంగా ఉంటూ అవినీతికి పాల్పడుతున్నారని ఆ పార్టీ చీఫ్ బండి సంజయ్ ఆరోపిస్తున్నారు.అయితే ఇటీవల కొందరు అవినీతికి పాల్పడుతున్న ఐఏఎస్ అధికారుల జాబితాను ఆ డిపార్ట్ మెంట్ లో పనిచేసేవాళ్లు బీజేపీ నాయకులు అందించారని చెబుతున్నరు. వీరి గురించి కేంద్రంలో వివరించడానికి ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇటీవల తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూ సమస్యలు తీవ్రమయ్యాయి. కొందరు లక్షలు పెట్టి కొంటున్న భూమి తమ పేరు మీదకు రావడానికి నానా కష్టాలు పడుతున్నారు. ధరణి పోర్టల్ ద్వారా ఇలాంటి సమస్యలు ఉండవని కేసీఆర్ చెప్పినా.. దీనితోనే సమస్యలు మరీ ఎక్కువయ్యాయని భూస్వాములు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక జిల్లాకు సంబంధించిన భూముల చిట్టా అంతా కలెక్టర్ కనుసన్నల్లోనే ఉంటుంది. అందువల్ల కొందరు ఇలాంటి ఉన్నతధికారుల చేత అవినీతి చేయిస్తున్నారని అంటున్నారు. మరికొందరు మాత్రం రాజకీయంగా తమకు స్వప్రయోజనాలు కలిగేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారన్న చర్చ సాగుతోంది.ఇలాంటి వారిని సహించలేని కొందరు వారి చిట్టాను బీజేపీ నాయకులకు ఉప్పందించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఓ నలుగురు ఐఏఎస్ ల జాబితా బండి సంజయ్ చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నలుగురు మాత్రమేనా? ఇంకా చాలా మంది ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ బండి సంజయ్ కేంద్రలో ఈ విషయంపై సీరియస్ గా కసరత్తు చేస్తే అటువంటి అధికారులపై చర్యలు తప్పేలా లేవు. దీంతో సదరు అధికారుల్లో వణుకు మొదలైంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking